పరాభవ నామ సంవత్సరం : 12 రాశుల పూజా నియమాలు
🐏 మేష రాశి
శనివారం, సోమవారం నియమాలు పాటించాలి. శివాలయంలో రుద్రాభిషేకం, హనుమాన్ ప్రదక్షిణలు చేయాలి.
🐂 వృషభ రాశి
మంగళవారం నియమాలు పాటించాలి. రాహువు సంబంధించిన పూజలు, దానాలు చేయాలి.
👬 మిధున రాశి
అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ నరగోష ఎక్కువగా ఉంటుంది. శివాలయ సందర్శనం మేలు కలిగిస్తుంది.
🦀 కర్కాటక రాశి
మంగళ, శనివార నియమాలు పాటించి శివాలయ సందర్శనం మంచిది.
🦁 సింహ రాశి
మంగళ, గురు, శనివార నియమాలు పాటించి రుద్రాభిషేకం చేయాలి. సంవత్సరం పాటు శివ పంచాక్షరి జపం, హనుమాన్ ప్రదక్షిణలు చేయడం శ్రేయస్కరం.
👩 కన్య రాశి
మంగళ, గురువార నియమాలు పాటించి శివాలయ ప్రదక్షిణలు, అభిషేకాలు చేయాలి.
⚖️ తుల రాశి
నరగోష అధికంగా ఉంటుంది. మంగళ, శనివార నియమాలు పాటిస్తూ శివాలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం.
🦂 వృశ్చిక రాశి
మంగళ, శనివార నియమాలు పాటిస్తూ రాహు గ్రహ పూజలు, దానాలు చేయాలి. శివపంచాక్షరి మంత్ర జపం ప్రతిరోజూ చేయడం మంచిది.
🏹 ధనస్సు రాశి
నరఘోష మరియు శని ప్రభావం ఉండుట వలన శని, మంగళవార నియమాలు పాటించాలి. శివాలయ సందర్శనం, హనుమాన్ ప్రదక్షిణలు, శివనామ స్మరణ చేయాలి.
🐊 మకర రాశి
సోమ, మంగళవార నియమాలు పాటిస్తూ రాహు, కుజ గ్రహాల పూజలు, దానాలు చేయాలి. హనుమాన్ ప్రదక్షిణలు శ్రేయస్కరం.
🏺 కుంభ రాశి
శని, మంగళవార నియమాలు పాటిస్తూ శని, రాహు గ్రహాలకు సంబంధించిన పూజలు, దానాలు చేయాలి. శివాలయ సందర్శనలు, హనుమాన్ ప్రదక్షిణలు చేయాలి.
🐟 మీన రాశి
శని, మంగళవార నియమాలు పాటిస్తూ శని, రాహు గ్రహ పూజలు, దానాలు చేయాలి. శివాలయ సందర్శనం, హనుమాన్ ప్రదక్షిణలు శ్రేయస్కరం.
🙏 ముఖ్య గమనిక
ఈ సంవత్సరం అన్ని రాశుల వారు ప్రతిరోజూ ఒక రాగి చెంబుడు నీళ్ళు శివునిపై పోసి, "ఓం నమః శివాయ" మంత్రాన్ని జపిస్తే శుభప్రదం.
