వివాహం : అమ్మాయిలు - అబ్బాయిలు - తల్లితండ్రులు
వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్న అమ్మాయిలు / అబ్బాయిలు మరియు వారి తల్లితండ్రులు ఈ క్రింది సూచనలను తప్పక గ్రహించాలి.
🔹 వధువు / వరుడు గ్రహించాల్సిన అంశాలు
- వివాహం అంటేనే సర్దుకు పోవడం.
- వివాహం అంటే స్వర్గం అని భావించకండి.
- వివాహం బాధ్యతలతో కూడిన జీవితం.
- వివాహం తరువాత స్వేచ్ఛ తగ్గుతుందని గ్రహించండి.
- నాది - నీది అనే భావన వదలాలి.
- ఫ్రెండ్స్ / సహ ఉద్యోగులను పరిమితిలో ఉంచడం మంచిది.
- జీవిత భాగస్వామి పూర్తిగా మీ కోరికల ప్రకారం ఉండరు.
- ఇద్దరి తల్లితండ్రులను గౌరవించాలి.
- సంతానం ఒక బాధ్యత.
- ‘విడాకులు’ ఆలోచన ఉంటే వివాహం చేయకపోవడం మంచిది.
- భార్య / భర్త బానిస కాదు – సహచరుడు.
- జీవిత భాగస్వామి ఉత్తమ స్నేహితుడు.
- కుటుంబ విషయాలు బయటకు చెప్పకండి.
- గొడవలు సహజం – వాటిని బయటకు తీసుకురావద్దు.
🔹 వధువు బాధ్యతలు
- ఇంటి పనులు, కుటుంబ బాధ్యతలు నిర్వహించాలి.
- అత్త వారి కుటుంబాన్ని మీ కుటుంబంగా భావించాలి.
- ప్రతి విషయాన్ని పుట్టినింటితో పోల్చకండి.
🔹 వరుడు బాధ్యతలు
- భార్య తన కుటుంబాన్ని వదిలి వచ్చిన విషయం గుర్తుంచుకోండి.
- ఆర్థిక బాధ్యత మీది.
- కుటుంబ విషయాలు బయటకు చెప్పకండి.
- భార్య తల్లితండ్రులను గౌరవించండి.
🔹 అమ్మాయి తల్లి తండ్రులు
- అమ్మాయికి ఒత్తిడి చేయకండి.
- వియ్యంకులను గౌరవించండి.
- కొత్త కుటుంబానికి అలవాటు పడటానికి సమయం పడుతుంది.
- భార్య భర్తల గొడవలో జోక్యం చేసుకోకండి.
- మీ అమ్మాయి మాటలతో ఆవేశపడకండి.
🔹 అబ్బాయి తల్లి తండ్రులు
- కోడలికి ప్రాధాన్యత ఇవ్వాలి.
- కోడలిని ప్రేమతో చూసుకోవాలి.
- కోడలి బాగోగులు మీ బాధ్యత.
- కోడలు ఎప్పుడూ బాధపడకుండా చూడాలి.
- మీరు ఎలా చూసుకుంటే, మీ కూతురిని కూడా అలాగే చూస్తారు.
👉 పాటిస్తే అందరూ హాయిగా ఉంటారు… ✍️
