Ads Area

మన ఆరోగ్యం - వంటగదిలోనే షుగర్ తగ్గించే దినుసులు

0

 మన ఆరోగ్యం - వంటగదిలోనే షుగర్ తగ్గించే దినుసులు



మన శరీరంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి అనేక మార్గాలున్నాయి. కొన్ని మన వంటగదిలోనే ఉంటాయి. జీలకర్ర, చియా, గుమ్మడికాయ, పొద్దుతిరుగుడు విత్తనాలు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.

వీటిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

ఈ విత్తనాలన్నింటిలో ఉండే ఫైబర్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగనివ్వదు. చక్కెర శోషణను, జీర్ణక్రియను నెమ్మదిగా చేస్తుంది.

ఈ విత్తనాలు ప్రతి ఒక్కరి ఇంటి వంటగదిలో ఉంటాయి. ఆహారంలో భాగంగా చేర్చుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చు.

🌿 జీలకర్ర

రక్తంలో యూరియా స్థాయిని తగ్గించడంతోపాటు మధుమేహం లక్షణాలను నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వల్ల పెరిగే సమస్యలను తగ్గించడంలో ఉపయోగకరం.

🌿 మెంతులు

ప్రతిరోజు గోరువెచ్చని నీటిలో కలిపి ఖాళీ కడుపుతో తీసుకుంటే షుగర్ అదుపులో ఉంటుంది. మెంతికూర రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను సహజంగా తగ్గిస్తుంది.

🌿 గుమ్మడి గింజలు

మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఎంతో ఉపయోగకరం.

🌿 పొద్దుతిరుగుడు విత్తనాలు

క్లోరోజెనిక్ ఆమ్లం ఉండి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఇందులో ఫైటోస్టెరాల్, గ్లైకోసైడ్స్, కెఫిన్, కునిక్ యాసిడ్ ఉన్నాయి.

💡 ఆరోగ్య సూచన:

ఈ విత్తనాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా సహజంగా షుగర్ నియంత్రణ సాధ్యమవుతుంది.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area