వికర్ణుడు - కౌరవ సోదరుడే అయినా ద్రౌపదికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాడు
రాజ్యాధికారం కోసం దాయాదుల మధ్య సాగిన వివాదం చివరకు కురు వంశ వినాశనానికి కారణమైంది. ద్వాపరయుగం నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులను వివిధ పాత్రల ద్వారా వేదవ్యాసుడు తెలియజేశాడు.
మహాభారతంలోని కొన్ని పాత్రలు మాత్రం తరుచూ ప్రస్తావనకు వస్తాయి. వీటిలో కర్ణుడు పేరు తెలియనివారు ఉండరు. కానీ, కర్ణుడి వ్యక్తిత్వానికి ఏమాత్రం తీసిపోని ఉదాత్తతమైన వ్యక్తి దుర్యోధనుడి సోదరుడు వికర్ణుడు.
నిండు సభలో ద్రౌపదికి అన్యాయం జరుగుతుంటే పాండవులు సహా ధ్రుతరాష్ట్ర, భీష్మ, ద్రోణ, కృపాచార్యుడు చోద్యం చూసినా ఆ ఒక్కడే దుర్యోధనుని చర్యను ఎదిరించాడు.
అలాగని కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల పక్షాన నిలవలేదు. అన్నదమ్ముల రక్త సంబంధానికి కట్టుబడి కౌరవుల పక్షాన యుద్ధం చేశాడు.
📜 వికర్ణుని బాల్యం మరియు విద్య
వికర్ణుడు తన కౌరవ సోదరులతో హస్తినలో అల్లారుముద్దగా పెరుగుతూ సకల విద్యలను ఔపోసానపట్టాడు. దుర్యోధనాదులతో కలిసి భీష్మ, ద్రోణ, కృపాచార్య లాంటి వారివద్ద యుద్ధ విద్యలో నైపుణ్యం సంపాదించాడు.
⚖️ ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో ధైర్యం
మాయా జూదంలో పాండవులను ఓడించిన దుర్యోధనుడు పణంగా పెట్టిన ద్రౌపదిని ఈడ్చుకురమ్మని దుశ్శాసనుని పంపుతాడు. ఆ సమయంలో పెద్దలంతా మౌనం పాటిస్తే, వికర్ణుడు మాత్రం ఇది తప్పని ధైర్యంగా ప్రశ్నించాడు.
ఈ చర్యల వల్ల కురువంశానికి మచ్చ వస్తుందని హెచ్చరించిన వికర్ణుడిని కర్ణుడు అడ్డుకున్నాడు.
⚔️ కురుక్షేత్ర యుద్ధం
పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసిన తర్వాత రాజ్యం కోసం రాయబారం విఫలమవడంతో కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమైంది.
ధర్మం పాండవుల పక్షాన ఉందని వికర్ణుడు గ్రహించినా, తన సోదరుడైన దుర్యోధనుడినే అనుసరించాడు.
📖 గీతలో వికర్ణుడి ప్రస్తావన
ఈ శ్లోకంలో వికర్ణుడు గొప్ప యోధుడిగా ప్రస్తావించబడటం అతని ప్రతిభకు నిదర్శనం.
🔥 వీరమరణం
కురుక్షేత్ర సంగ్రామం 14వ రోజున భీముడితో జరిగిన భీకర యుద్ధంలో వికర్ణుడు వీరమరణం పొందాడు.
వికర్ణుని ధర్మబద్ధతకు భీముడే సైతం గౌరవం చూపాడు. చివరి వరకు ధర్మాన్ని అనుసరించిన వికర్ణుడు చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు.
