🐐 మేషం
ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి.
దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.
వ్యాపారులకు చిక్కులు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.
🐂 వృషభం
ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
వ్యాపారమున ఆశించిన లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.
విద్యార్థులకు విదేశీ ప్రయాణ ప్రయత్నాలలో కీలక సమాచారం అందుతుంది.
👩❤️👨 మిధునం
ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
చేపట్టిన పనులు ముందుకు సాగవు. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది.
ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.
🦀 కర్కాటకం
గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. వ్యాపారులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి.
అవసరానికి సన్నిహితుల సహాయం పొందుతారు. స్థిరాస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి.
నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగులకు దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
🦁 సింహం
ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి.
ఆరోగ్యపరంగా వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.
వ్యాపారులకు గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి.
💃 కన్య
వృత్తి వ్యాపారాలలో అనుకున్నది సాధిస్తారు. దైవచింతన పెరుగుతుంది.
నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు.
సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు.
⚖️ తుల
వాహన వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు.
ఆలయ దర్శనం చేసుకుంటారు. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు.
ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశములు లభిస్తాయి.
🦂 వృశ్చికం
ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.
వ్యాపారమున స్వల్ప లాభాలు అందుతాయి. బంధు మిత్రులు మీ మాటతో విబేదిస్తారు.
ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక వాతావరణం చికాకుగా ఉంటుంది.
🏹 ధనస్సు
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు.
ఉద్యోగులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
🐊 మకరం
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి.
ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. చేపట్టిన పనుల్లో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.
ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది.
🏺 కుంభం
మిత్రుల నుంచి శుభవర్తమానాలు అందుతాయి. భూ వివాదాలు పరిష్కారమౌతాయి.
వృత్తి వ్యాపారములు ఉత్సాహంగా సాగుతారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.
నిరుద్యోగుల ఊహలు నిజమవుతాయి. ఉద్యోగుల ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది.
విద్యార్థుల కష్టం ఫలిస్తుంది.
🦈 మీనం
వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. అనారోగ్య విషయంలో స్వల్ప ఇబ్బందులుంటాయి. ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులుంటాయి. వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున పరిస్థితులు అంతగా అనుకూలించవు.
