🌿 ప్రతి వ్యక్తి జీవితంలోను గ్రహాల కారణంగా శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు రెండు ఉంటాయి.
🌸 శుభ ఫలితాలు ఉన్నప్పుడు ఆనందంగానే ఉంటాం. అయితే అశుభ ఫలితాలు కలిగినప్పుడు మాత్రం చాలా బాధపడుతూ ఉంటాం.
🌿 అలాంటి అశుభ ఫలితాలు కలిగినప్పుడు వాటిని తొలగించుకోవడానికి గణపతిని పూజించాలి.
🌹🙏 ఏ గ్రహ దోషం ఉన్నవారు గణపతిని ఎలా పూజించాలో తెలుసుకుందాం.... 🙏🌹
🌸
సూర్యదోష నివారణకు: ఎర్రచందనంతో వినాయకుణ్ణి పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
🌿
కేతు దోష నివారణకు: తెల్ల జిల్లేడు పూలతో వినాయకుణ్ణి పూజించాలి.
🌸
చంద్ర దోష నివారణకు: వెండి లేక పాలరాతితో తయారుచేసిన వినాయకుడిని పూజించాలి.
🌿
కుజదోష నివారణకు: రాగితో తయారుచేసిన వినాయకుడిని పూజిస్తే మంచి ఫలితం త్వరగా కనపడుతుంది.
🌸
గురు దోష నివారణకు: పసుపు, చందనం లేక బంగారంతో తయారుచేసిన వినాయకుణ్ణి పూజించాలి.
🌿
బుధ దోష నివారణకు: మరకత వినాయకుణ్ణి పూజించాలి.
🌸
శుక్ర దోష నివారణకు: స్ఫటిక వినాయకుడికి భక్తితో పూజించాలి.
🌿
రాహు గ్రహ దోషానికి: మట్టితో తయారుచేసిన వినాయకుణ్ణి పూజిస్తే ఫలితం ఉంటుంది.
🌸
ఇంటిలో సుఖ శాంతులు ఉండాలంటే: స్ఫటిక వినాయకుణ్ణి పూజించాలి.
🌿
మానసికంగా ప్రశాంతత కలగాలంటే: పాలరాతితో తయారుచేసిన వినాయకుణ్ణి పూజించాలి.
