అమావాస్య పూజలు ఎలా చేయాలి?
అమావాస్య రోజున చేయవచ్చని చెప్పబడే పూజలు, ఆరాధనలు మరియు ఆధ్యాత్మిక విధానాలు
ఇంటికి దిష్టి తీయండి, పిల్లలకు దిష్టి తీయండి. ఈ అమావాస్య లక్ష్మీ పూజకు విశేషమని చెబుతారు. అమావాస్య పూజలు ఎలా చేయాలో తెలుసుకుందాం.
అమావాస్య ప్రత్యేకత
ఉదాహరణకు ఇక్కడ కొన్ని చెప్పాను గమనించండి. అమావాస్య నాయకి అయిన జగన్మాత ఆ రోజు కామేశ్వరి స్వరూపంగా కామేశ్వరుడితో ఏకాంతంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది కనుక అమావాస్య పూజ త్వరగా అనుగ్రహిస్తుంది, మంత్రం సిద్ధిస్తుంది అని ఆధ్యాత్మిక విశ్వాసం.
సంధ్యా సమయంలో విశేష పూజ
లలిత, లక్ష్మి, కాళీ, భైరవ ఉపాసకులు సంధ్యా కాలంలో విశేష పూజ చేయాలి.
దీప లక్ష్మీ పూజ చేయాలి. అఖండ దీపాన్ని ప్రారంభించడానికి మంచి సమయంగా కూడా భావిస్తారు.
దిష్టి నివారణ మంత్రం
1. సకల దృష్టి నివారణ మంత్రము
ఓం క్ష్రామ్ ఓం
నిమ్మకాయలను, విభూతిని పై మంత్రముచే 108 పర్యాయములు అభిమంత్రించి దృష్టినందిన వారికి, నిమ్మకాయలతో దిగదుడిచి, కోసి పారవేసి, శరీరమంతట విభూతిని రాచిన సకల దృష్టి దోషములు నివారించబడగలవని విశ్వాసం.
2. దృష్టి దోష నివారణ మంత్రము
పై మంత్రముచే 27 పర్యాయములు అభిమంత్రించిన కల్లు ఉప్పుతో దృష్టి చెందిన వారికి ముమ్మారు దిగదుడిచి, నీటిలో వేసిన ఆ ఉప్పు కరగు సరికి దృష్టి బాధలు అంతరించగలవని ఆధ్యాత్మిక విశ్వాసం.
అమావాస్య పూజ 🌹
అమావాస్య రోజు ఎలా చేయాలి? ఏం చేయాలో, ఎలా చేస్తే మంచిదో చూద్దాం.
అమావాస్య రోజు ముఖ్యంగా లక్ష్మీదేవిని, భైరవుడిని, కాళీమాతను, దుర్గాదేవిని విశేషంగా పూజించే రోజు అని ఆధ్యాత్మిక సంప్రదాయాలలో భావిస్తారు.
పరిహార మంత్రాలు జపం చేస్తున్నవారు ఉద్ది గారెలు, బెల్లం పానకం నైవేద్యం పెట్టి, అధికంగా అమావాస్య రోజు జపము చేసి, విశేషంగా జపం చేస్తున్న దేవతను పూజించాలి అని చెబుతారు.
నైవేద్యం మరియు ప్రసాదం
అది ఏ ఉపాసనా దేవత అయినా అవే నైవేద్యంగా పెట్టి, ఆ ప్రసాదాన్ని ఒక రెండు వడలు అయినా కుక్కకు పెట్టి, తర్వాత మీరు తీసుకోవాలని ఈ సంప్రదాయంలో చెబుతారు.
1 అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ
అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించాలి అనుకునే వారు కమలాత్మిక హైమావతి సంపుటీకరణ అష్టోత్తరంతో అర్చన చేసి, కమలాత్మిక స్తోత్రం చేసి, కమలాత్మిక ఖడ్గమాల చదివి, మీ శక్తి కొద్దీ నైవేద్యం సమర్పించాలి.
మీ గృహస్థులు కానీ వారికి ఎవరికైనా కాస్త ప్రసాదాన్ని పంచి, తర్వాత ఆ అర్చన కుంకుమను ఇంటిల్లిపాది ధరించాలని చెబుతారు.
కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి విఘ్నాలు తొలగుతాయని చెబుతారు.
భార్య స్తోత్రం చదువుతూ భర్త కుంకుమ పూజ చేస్తే ఆ కుటుంబంలో నిత్య అవసరాలకు లోటు ఉండదని విశ్వాసం.
2 అమావాస్య రోజు భైరవ ఉపాసన
అమావాస్య రోజు భైరవ ఉపాసన చాలా విశేషమని చెబుతారు.
కుటుంబ కలహాలు, ఆస్తి గొడవలు, శత్రు బాధలు, అనుమానాలు, ఇంటికి, వృత్తి, వ్యాపారాలకు ఉన్న నరదిష్టి మొత్తం అమావాస్య రోజు చేసే భైరవుడి ఆరాధన ద్వారా తొలగిపోతుందని ఆధ్యాత్మిక విశ్వాసం.
సాంబ్రాణి పైన తెల్ల ఆవాలు వేసి భైరవుడిని స్మరిస్తూ ఇల్లంతా ధూపం వేయాలి.
తర్వాత సాంబ్రాణి పైన బిర్యానీ ఆకులు వేసి మీ భర్త, పిల్లలకు ఆ సాంబ్రాణి వేయాలని చెబుతారు.
తరచుగా కిందపడటం, దెబ్బలు, దిష్టి దోషాలు పోతాయని ఈ ఆచారంలో విశ్వాసం ఉంది.
భైరవుడికి తీపి పదార్థంలో లడ్డు అంటే ఇష్టం అని, అది పెట్టగలిగితే ఆ రోజు నైవేద్యంగా పెట్టి కుక్కకు ఆహారంగా వేయాలని చెబుతారు.
శత్రు బాధలు, మిమ్మల్ని భయపెడుతున్న బాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక విశ్వాసం.
3 కాళీమాతకు విశేష పూజ
కాళీమాతకు విశేషమైన రోజు అని భావిస్తూ ఆ తల్లికి అరటిపండ్లు నైవేద్యం పెట్టి, స్తోత్రం చేసి హారతి ఇవ్వాలి అని చెబుతారు.
వయసైన పెద్ద ముత్తైదువులకు ఆ అరటిపండు, తాంబూలం ఇవ్వాలి. ఆమె స్వయంగా స్వీకరిస్తుందని ఆధ్యాత్మిక విశ్వాసం.
4 దుర్గామాతకు విశేష పూజ
దుర్గామాతను విశేషంగా పూజించాల్సిన రోజు అని భావిస్తారు. ఎప్పుడూ లోకాలను రక్షిస్తూ కాపాడుతూ ఉండే రూపం దుర్గారూపం అని చెబుతారు.
ఆ శివుడికి కూడా కష్టం వచ్చినప్పుడు దాల్చే రూపం దుర్గారూపం అని, అంత శక్తి రూపం దుర్గారూపం అని ఆధ్యాత్మిక భావన.
అంబలి నైవేద్యం పెట్టాలి.
దుర్గా స్తోత్రాలు, అష్టోత్తరం, మహిషాసురమర్దిని స్తోత్రం ఇలా ఎన్ని స్తోత్రాలతో అయినా పూజ, కుంకుమ అర్చన చేసి హారతి ఇచ్చి, ఆ నైవేద్యం పంచుకుని తాగాలని చెబుతారు.
అన్ని రకాల విఘ్నాలు, ఆపదలు తొలగించి కుటుంబానికి రక్షణ కవచంలా కాపాడుతుందని ఆధ్యాత్మిక విశ్వాసం.
ముఖ్యంగా మిరియాల పొడి కలిపిన గారెలు చేసి నైవేద్యం పెట్టాలి. పూజ తర్వాత కుక్కకు పెట్టి, తర్వాత తీసుకుంటే మీకు ఉన్న జాతక దోష ప్రభావం తగ్గుతుందని ఈ సంప్రదాయంలో చెబుతారు.
పూజకు సమయం
అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ చేయాలి అనిపిస్తుంది కదా. అన్ని చేసినా గంట సమయం కన్నా పట్టదని చెబుతారు.
మీ దగ్గరే పుస్తకాలు ఉంటే చూసి చేయవచ్చు.
సాంబ్రాణి ధూపం
సాంబ్రాణి పైన తెల్ల ఆవాలు వేసి ధూపం అందరూ ఇంట్లో వేసుకోవచ్చు, పూజ చేయకపోయినా అని ఈ ఆచారంలో చెబుతారు.
