GET MORE DETAILS

1860 లో విశాఖపట్నంలోని సంత (మార్కెట్) ధరలు ఈ విధంగా వున్నాయి. ధరలు రుపాయకు మాత్రమే.

1860 లో విశాఖపట్నంలోని సంత (మార్కెట్) ధరలు ఈ విధంగా వున్నాయి. ధరలు రుపాయకు మాత్రమే.



(1) బియ్యం మొదటిరకం రుపాయకు 36 శేర్లు

(2) రెండోరకం 48 శేర్లు

(3) ఉలవలు 42 శేర్లు 

(4) పెసలు 42 శేర్లు

(5) కందులు 36 శేర్లు

(6) గోధుమలు 30 శేర్లు

(7) బఠాణీలు (చిన్నవి) 36 శేర్లు

(8) బీన్స్  36 

(9) జొన్నలు 36 శేర్లు

(10) రాగులు 120 శేర్లు

(11) గడ్డివిత్తనాలు 120 శేర్లు

(12) కుంగు Kungu ** (?) 120 శేర్లు

(13) గన్టీ Guntea (?) 120 శేర్లు

(14) కుల్స kulsa (?) శేర్లు

(15)  ఎల్లగీసే విత్తులు  Alsi linseed(?) 120 శేర్లు

(16) అల్లం 30 శేర్లు

(17) 36 శేర్లు

(18) మోవా నూనె Mowa oil (?)  9 శేర్లు

(19) అల్లంనూనె  4 శేర్లు

(20) అవనూనె 4 శేర్లు

(21) తాటికల్లు 36 శేర్లు

(22) సారాయి 36 శేర్లు

(23) పసుపు 16 శేర్లు

(24) సాంబ్రాణి  60 శేర్లు

(25) బెల్లం  20 శేర్లు

(26) పొగాకు 10 శేర్లు

(27) తిక్కూరు ? (Arrowroot) 24 శేర్లు

(28) లక్క 3 1/2 

(29) పత్తి 4 శేర్లు

(30) ఉప్పు  12 శేర్లు

(31) మిరపకాయలు 24 శేర్లు.


శేరు అంటే అప్పటిలో అమలులో నున్న కొలమానాలలోవున్న మద్రాసు శేరు.

బహుశా గిరిజనులు (ఏజెన్సిలోని ఆటవికుల) పంటలై వుండవచ్చను. వాటి గురించి నిఘంటువులలో వివరాలు లేవు. స్థానిక గోండుభాషై వుండవచ్చును.


ఇక 1860 లోవున్న కొలమానాల పేర్లేమిటో చూద్దాం.

డబ్బు (కరెన్సి) :

(1) 16 గవ్వలు = ఒక గుండ

(2) 5 గుండలు = ఒక భూరి

(3) 12 భూరీలు = ఒక దుగ్గాణి

(4) 10 దుగ్గాణిలు = ఒక రుపాయి


ఆ రోజులలో విశాఖపట్నం జిల్లాలో ఏజెన్సిప్రాంతంతో కలిపి

(1)విశాఖపట్నం (2) జైపూర్ (ఒడిషాలోచేరింది) (3) బొబ్బిలి (4) ముదిగల్లు (5) కాశీపురం (6) సర్వేపల్లి (7) భీమవరం (8) సాలూరు (9) పంచిపెంట (10) సంగంవలస (11) పార్వతీపురం (12) కురుపాం (13) కశీంకోట (14) మేలుపాక (15) అనకాపల్లి (16) మునుగుపాక (17) గొడిచెర్ల (18) నక్కపల్లి (19) కుప్పిలి (20) షేర్ పురం (21) సిరిపురం (20) వాల్తేరు (21) వురుట్ల (22) చీపురుపల్లి (23) రావాడ (24) మామిడివాడ (మామిడాడ) (25) కొండవలస (26) బొనంగి (27) కొండవలస (28) పద్దగుమ్మలూరు (29) పెంట

మొదలైన జమీందారీ, జమీందారీ ఎస్టేటులు వుండేవి. అప్పట్లో ఈ జమీందారీలన్ని సెయింటు జార్జికోట  ( మద్రాసు ప్రావిన్స్) లో చేరి వుండేవి. కనుక ద్రవ్యమారకం (కరెన్సి) రూపాయే. ఇక్కడ పేర్కొన్న ద్రవ్యవిలువలు, కొలతలు, తూకాలు స్థానికంగా అమలులో వుండవచ్చును.


ధాన్యపు, నూనెల  కొలతలు :

(1) 4 బిస్సువలు (Bissua) = ఒక గిద్ద

(2) 2 గిద్దలు = ఒక సోల

(3) 2 సోలలు = ఒక బ్రిద్ద (bridda)

(4) 4 బ్రిద్దలు = ఒక అడ్డ

(5) 4 అడ్డలు = ఒక మణువు (మణుగులు)

(6) 4 మణుగులు = ఒక 

(7) 24 రుపాయలు (Rupees) = ఒకశేరు

(8) 10 శేర్లు = ఒక  బిస్సా

(9) 4 బిస్సాలు = ఒక మడుంగో

(10) 4 మడుంగోలు = ఒకపుట్టి

(11) 30 పుట్లు = ఒక గుర్సా


బంగారం, వెండితూకాలు :

(1) 16 గింజలు (గురువెందగింజలు = ఒక చిన్నం

(2) 15 చిన్నాలు = ఒక మదో

(3) 2 మదోలు = ఒక తులం.


జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

Post a Comment

0 Comments