Ads Area

ఖజురహో సంగతులేమిటో తెలుసుకుందాం...?

0

ఖజురహో సంగతులేమిటో తెలుసుకుందాం...?




భారతీయ శిల్పకళ, సంగీతం, నృత్యం, కామకళతో సహా ఇతర కళలన్నింటినీ సజీవంగా మలచిన దేవాలయాల నియలం ఖజురహో. దీనిని 10వ శతాబ్దంలో 'చండేలా రాజ వంశస్థులు' నిర్మించారని చరిత్ర చెబుతోంది. మొత్తం 85 మందిరాలు నిర్మించినట్లు చరిత్ర చెబుతున్నా.. నేడు మిగిలినవి 20 మందిరాలే. మిగిలినవన్నీ శిథిలమైపోయి ఉంటాయి. ఇవి శైవ, వైష్ణవ, జైన, తాంత్రిక మందిరాలు. చండేలా రాజ వంశ పతనం తర్వాత ఆ ప్రాంతం వదలేశారు. ఆ దేవాలయాల చుట్టూ అడవులు పెరిగి కనిపించకుండా పోయాయి. అటువంటి దేవాలయాలు తిరిగి బ్రిటీష్ పాలనలో ఒక ఇంజనీర్ కంటపడి వెలుగు చూశాయి. నాటి నుంచి ఖజురహో శిల్పాలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. ఆ శిల్ప కళలను కామసూత్ర ఆధారంగా మలిచారనిపిస్తుంది. ఆ విధంగా భారతీయ సంస్కృతి మహోన్నతమైనదని అన్ని దేశాలవారూ కొనియాడారు. 

ఖజురహో వచ్చిన విదేశీయులు, యాత్రికులు వెయ్యేళ్ల క్రితమే భారతీయ సంస్కృతి ఇంత ముందున్నదా! అని ఆశ్చర్యపోతుంటారు. దేవాలయాల గోడలపైన అలాంటి లైంగిక శిల్పాలు ఎందుకు చెక్కిఉంటారో ఇప్పటికీ ఎవ్వరికీ అర్థం కాని ప్రశ్నే. వారు ఎందుకోసం చేసినా నేడు మనకు కనువిందు చేస్తుంటాయి... అందుకే ఖజురహో ఒక్కసారైనా తిలకించాలి అంటుంటారు.

ఖజురహోను నేటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పలు పర్యాటక క్షేత్రాలలో ముఖ్యమైనదిగా చెప్పుకుంటున్నారు.

దిల్లీ నుంచి వారణాసి వెళ్లే విమానాలు ఖజురహోలో ఆగి వెళ్తాయి. రైల్లో వెళ్లేవారు ఝాన్సీ లేదా సాత్నా రైల్వే స్టేషన్‌లో దిగి బస్లో ఖజురహో వెళ్లవలసి ఉంటుంది.

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area