GET MORE DETAILS

"లక్ష్మీదేవి తామర పువ్వులో కొలువై ఉండడానికి కారణం ఏమిటో తెలుసా"...?

 "లక్ష్మీదేవి తామర పువ్వులో కొలువై ఉండడానికి కారణం ఏమిటో తెలుసా"...?

       మనం చినప్పటినుంచి చూస్తూనే ఉంటాం. లక్ష్మీ దేవి అనగానే తామర పువ్వులో కూర్చుని, పక్కన రెండు ఏనుగులు, అమ్మవారి చేతిలో నుంచి డబ్బులు కింద పడుతూ ఉన్నటువంటి ఫోటో మన మెదడులో కదులుతుంది.


తామర పువ్వు కొలనులో లేదా సరస్సులోపుడుతుంది.


అలాంటి తామర పువ్వు పై కూర్చుని మనకు దర్శనమిస్తున్న లక్ష్మీదేవి కూడా తను ఒక చోట స్థిరంగా ఉండనని, తాను నిలకడ లేని దానినని చెప్పడం కోసమే లక్ష్మీదేవి తామర పువ్వు పై కొలువై ఉంటారు. మన ఇంట్లో కూడా డబ్బు ఎప్పుడూ నిలకడగా ఉండదు.

సర్వలోకరక్షిణి, సర్వజ్ఞానప్రదాయిని. శక్తి స్వరూపిణి అయిన ఆ జగజ్జననిని భక్తితో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది. సిరిసంపదలు, సౌభాగ్యాన్ని అనుగ్రహించే ఆ లక్ష్మీదేవిని సేవిస్తే కోరినవారికి కొంగుబంగారమవుతుంది.

లక్ష్మీదేవి పుట్టుక గురించి తెలుసుకోవాలంటే, ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళ్తుండగా, ఎదురుగా దుర్వాస మహర్షి తారసడతాడు. అల్లంతదూరాన ఇంద్రుని చూసిన దుర్వాసుడు, అమరావతి అధిపతికి గౌరవ సూచకంగా తన మెడలోని దండనిస్తాడు.

గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు, దండ ఇచ్చినదెవరన్న విషయాన్ని పట్టించుకోకుండా, కనీసం కృతజ్ఞతలు చెప్పకుండా, ఆ దండను తన ఏనుగు తొండానికి తగిలిస్తాడు. తొండాన్ని అటు, ఇటు ఆడిస్తున్న ఏనుగు, దండను కిందికి విసిరేసి కాళ్ళతో తొక్కుతుంది. అసలే కోపిష్ఠి అయిన దుర్వాసుడు, ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపాద్రిక్తుడై, ‘‘ఓ ఇంద్రా! మితిమించిన అహంకారం, గర్వాతిశయాలతో ప్రవర్తించిన నిన్ను, ఈ భోగభాగ్యాలన్నీ వీడిపోతాయి’’ అని శపించాడు.

అప్పుడు ఇంద్రుని కళ్ళకు కప్పుకున్న తెరలు తొలగడంతో దుర్వాస మునిని క్షమించమంటూ వేడుకున్నాడు. అది విన్న దుర్వాసుడు, శాపాన్ని అనుభవించక తప్పదని, అయితే విష్ణుమూర్తి కృపతో పూర్వ వైభవాన్ని పొందడం జరుగుతుందని చెప్పాడు. అనంతరం ఇం ద్రునిపై దుర్వాసుని శాపం పనిచేయడం ప్రారంభించింది. బలి నాయకత్వంలో రాక్షసు లు అమరావతిపై దండెత్తుతారు. ఇంద్రుని, అతని పరివారంతో పాటు స్వర్గం నుండి తరిమేస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంద్రుడు అజ్ఞాతంగా ఉండిపోయి, తన గురువు బృహ స్పతిని సలహా అడుగుతాడు.

అందుకు తగిర పరిష్కారాన్ని బ్రహ్మదేవుడే సూచిస్తాడని చెప్ప డంతో, ఇంద్రుడు తన పరివారంతో కలిసి వెళ్ళి విష్ణుమూర్తే చెబుతాడని బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు. అందుకు పరిష్కారాన్ని విష్ణుమూర్తే చెబుతాడని బ్రహ్మదేవుడు పలకడంతో అందరూ  విష్ణుసన్నిధికి చేరుకుంటారు. ఇంద్రాది దేవతల ద్వారా జరిగిన సంగతిని విన్న విష్ణుమూర్తి, రాక్షసుల సాయంతో పాలసముద్రాన్ని చిలికి, అందులో నుంచి వెలువడిన అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారం దక్కుతుందని అంటాడు. మందరపర్వతం, వాసుకితో పాలసముద్రాన్ని చిలకడం మొదలెడతారు.

విష్ణుమూర్తి కుర్మావతార రూపములో మందరపర్వతం మునిగిపోకుండా భరిస్తాడు. అనంతరం పాలసముద్రం నుండి ఎన్నోరకాలైన జీవులు, వస్తువులు వెలువడతాయి. అప్పుడే ఓ యువతి కళ్ళు చెదిరే అందంతో, అందెల మృదుమధుర రవళులతో, చేతిలో కలువలమాలతో ఉదయిస్తుంది. ఆమె లక్ష్మీదేవి, ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా అంగీకరిస్తూ ఆయన మెడలో మాల వేసి, నును సిగ్గులతో ఆయన సరసన నిలబడుతుంది. అలా క్షీరసాగర మథనం నుంచి జన్మించిన లక్ష్మీదేవి దుష్టశిక్షణార్థం మహావిష్ణువు ఎత్తిన అవతారాలన్నింటిలోనూ ఆయన సరసనే ఉంటుంది.

ధవళకాంతులతో మెరిసిపోతోన్న ఓ దేవత బయటకొచ్చి, తనను లక్ష్మి అంటారనీ, సంపదల దేవతనని, దీర్ఘకాలంనీవెంటే ఉన్నానని, ప్రస్తుతం తనను వదలిపెట్టడానికి ప్రహ్లాదుడు సిద్ధపడినందున తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళిపోవాల్సి వస్తోందని చెప్పి బయటపడుతుంది. ఈ విధంగా ధర్మ ప్రవర్తన, నిజం, అధికారం,నైతికబద్ధ ప్రవర్తన ఉన్నచోట లక్ష్మీదేవికొలువై ఉంటుందని అర్థమవుతోంది.

లక్ష్మీదేవి చల్లనిచూపుల కోసం భక్తులు ఎదురు చూస్తుంటారు. తమ ఇళ్లను పావనం చేయాలని ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తుంటారు. ఆతల్లి భక్త జనప్రియ. తనను పూజించిన భక్తులను తప్పక కరుణిస్తుంది.

Post a Comment

0 Comments