యడ్ల గోపాలరావు కు పద్మశ్రీ పురస్కారం - భారత రాష్ట్రపతి చేతులు మీదుగా ప్రధానం - హర్షం వ్యక్తం చేసిన సిక్కోలు ప్రజానీకం
దేశ విదేశాల్లో ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ రంగస్థల కళాకారులు యడ్ల గోపాలరావు కు భారత రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్ లో ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా యడ్ల గోపాలం అందుకున్నారు. సిక్కోలు రంగస్థల ఆణిముత్యానికి భారత రాష్ట్రపతి చే ఘనమైన సత్కారం లభించడం పట్ల జిల్లా వాసులు ముఖ్యంగా రాజాం నియోజకవర్గ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.యడ్ల గోపాలరావు రాజాం నియోజకవర్గము లోని సంతకవిటీ మండలం మందరాడ గ్రామానికి చెందిన వారు. యడ్ల గోపాలరావు రంగస్థల పద్యాలంటే తెలుగు ప్రజలు చెవి కోసుకుంటారంటే అది ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ఇప్పటికే దేశ, విదేశాల్లో కొన్ని వేల ప్రదర్శన లు ఆయన ఇచ్చి ఎన్నో సత్కారాలు, విలువైన బహుమతులు అందుకున్నారు.
0 Comments