GET MORE DETAILS

దీపావళి రోజు లక్ష్మీ పూజ చేస్తే సిరిసంపదలతో తులతూగటం ఖాయం

దీపావళి రోజు లక్ష్మీ పూజ చేస్తే సిరిసంపదలతో తులతూగటం ఖాయం

  హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో , భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో , అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. ఆశ్వయుజ మాసంలో కృష్ణ పక్షంలో దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి అంటేనే వెలుగుల పండుగ. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని సూచించేదే దీపావళి పండుగ. జీవితంలోని చీకట్లను పారద్రోలి వెలుగులు నింపేదే దీపావళి. దీపావళి అంటేనే సరదాలు , సంబరాలు , దీపాల వెలుగులు , బాణాసంచాల జిలుగులు , కుటుంబం అంతా కలిసి జరుపుకునే వేడుకలు. దీపావళి అంటేనే కాంతులు నింపే పండుగ. అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని , దీపాలను వెలిగించి , ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించే పండుగ దీపావళి.

దీపావళి భారతదేశం అంతటా జరుపుకునే ఒక పండుగ. ఇది చీకటిపై కాంతి , చెడుపై మంచి , నిరాశపై ఆశ యొక్క విజయాన్ని సూచించే పండుగ. దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. దీనిని దీవాలి అని దీపావళి అని కూడా పిలుస్తారు. ప్రజలు తమ ఇళ్లలో , దుకాణాలలో దీపాలు , కొవ్వొత్తులను వెలిగించి , సంపద , అదృష్టం , శ్రేయస్సుకు ప్రతీక అయిన లక్ష్మీ దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. దీపావళికి ముందు , ప్రతికూల శక్తిని తొలగించడానికి మరియు సానుకూలతను స్వాగతించడానికి ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకుని ఈ పండుగ జరుపుకుంటారు.

నవంబర్ 4న దీపావళి జరుపుకోనున్నారు. అమావాస్య తిథి నవంబర్ 4 వ తేదీ ఉదయం 6:03 గంటలకు ప్రారంభమై నవంబర్ 5 వ తేదీ తెల్లవారుజామున 2:44 గంటల వరకు కొనసాగుతుంది.

నవంబర్ 4వ తేదీ సాయంత్రం 6:09 నుండి రాత్రి 8:20 గంటల వరకు లక్ష్మీపూజ మరియు గణేశ పూజ నిర్వహించడానికి సమయముగా పండితులు చెబుతున్నారు. దృక్ పంచాంగ్ ప్రకారం , సూర్యాస్తమయం తర్వాత దీపావళి పూజ ప్రదోష కాలంలోనే నిర్వహిస్తారు. ఆ సమయంలో పూజ చేస్తేనే శుభాలు కలుగుతాయని పంచాంగం చెబుతోంది. నవంబర్ 4 న సాయంత్రం 5:34 నుండి రాత్రి 8:10 గంటల వరకు ప్రదోష కాల అమలులో ఉంటుంది. ఈ పండుగలో మరో విశేషం లక్ష్మీపూజ. 
హిందూ గ్రంధాల ప్రకారం , లక్ష్మీదేవి సంపద , శ్రేయస్సు మరియు సంతానోత్పత్తికి ప్రతీక. అందుకే కచ్చితంగా ప్రతి ఒక్కరూ లక్ష్మి పూజలు విశేషంగా చేస్తారు. ఆ లక్ష్మీదేవి అందరూ తమ గృహాలకు ఆహ్వానిస్తారు. బెంగాలీలు ఈ సమయంలో కాళీ దేవిని పూజిస్తారు. భారతదేశంలోని చాలా గృహాలు దీపావళి సమయంలో కూడా గణేశుడిని పూజిస్తారు.

రాముడు అయోధ్యకు వచ్చిన రోజు ఈ పండుగ జరుపుకోవడానికి అనేక కారణాలున్నాయి. హిందూ ఇతిహాసం రామాయణంలోని ఒక కథ దీపావళి పండుగకు సంబంధించి ప్రాచుర్యంలో ఉంది. 14 ఏళ్ళ తర్వాత రాముడు వనవాసం ముగించుకుని రావణుడిని ఓడించి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు , అయోధ్య నివాసులు దీపాలు వెలిగించి స్వాగతం పలికారు. అయోధ్య దేదీప్యమానంగా వెలిగిపోయింది. శ్రీరామచంద్రుడు అయోధ్యకు తిరిగి రావడం శ్రేయస్సు , ఆనందాన్ని సూచిస్తుందని అందుకే ఆ రోజును దీపావళిగా అయోధ్య వాసులు జరుపుకోగా అప్పటినుండి ఈ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా మారింది అని ఓ పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది.

దీపావళి పండుగకు సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు సత్యభామ నరకాసురుణ్ణి సంహరిస్తుంది. నరకాసుర సంహారంతో బహుళ చతుర్దశి నరక చతుర్దశి గా ప్రసిద్ధి పొందింది. నరకాసురుడనే రాక్షసుడు ప్రజలను పీడిస్తూ దేవ , మర్త్య లోకాలను ఇబ్బందులు పెడుతూ అందరినీ వేధింపులకు గురి చేస్తుండేవాడు. కృతయుగం లో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామి కి భూదేవికి అసుర సంధ్యా సమయంలో పుట్టిన నరకుడు తన చావు తల్లి చేతిలో పొందాలని వరం కోరుకుంటాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించి మహావిష్ణువు , సత్యభామను పెళ్లాడతాడు. భూదేవి అంశ అయిన సత్యభామ శ్రీకృష్ణుడు తో కలిసి నరకాసురుని అకృత్యాలను అరికట్టడానికి యుద్ధానికి వెళుతుంది. ఈ యుద్ధంలో సత్యభామ నరకాసురుని హతమారుస్తుంది. నరకాసురుని సత్యభామ సంహరించినందుకు , నరకాసురుడి పీడ విరగడయినందుకు అందరూ సంబరాలు జరుపుకుంటారు. దీపాలు వెలిగించి దీపావళి వేడుకను చేసుకుంటారు.

దీపావళి పండుగకు ప్రతి ఒక్కరు ముందుగా శుభ్రం చేసుకొని అందంగా అలంకరించుకుంటారు. ఇళ్లను పూల మాలలు , రంగోలీలు , దీపాలతో అలంకరిస్తారు. దీపావళి సందర్భంగా లడ్డూలు తప్పనిసరిగా చేస్తారు. దీపావళి రోజున వ్యాపారులు తమ ఖాతా పుస్తకాలను మార్చుకుంటారు. దీపావళి సందర్భంగా అపమృత్యు దోషం లేకుండా ఉండటం కోసం దీపావళి రోజు రాత్రి లక్ష్మీ పూజ నిర్వహిస్తారు.

చీకటిపై కాంతి , చెడుపై మంచికి ప్రతీక దీపావళి

దీపావళి 2021: తేదీ మరియు పూజ సమయాలు

ప్రదోష కాలంలోనే దీపావళి పూజ. లక్ష్మీ పూజ దీపావళి విశేషం

దీపావళి విశిష్టతను తెలిపే కథలెన్నో ...

సత్యభామ నరకాసుర సంహారంతో దీపావళి వేడుకలు :

దీపావళికి సుందరంగా ఇళ్ళు , ప్రత్యేక పూజలు :

Post a Comment

0 Comments