GET MORE DETAILS

గుహలు ఎలా ఏర్పడతాయి ?

గుహలు ఎలా ఏర్పడతాయి ?




కొండ గుహలలు  అధిక శాతము భూగర్భజలాల కదలివల్ల ఏర్పడినవే. భూమిమీదపడిన నీరు లోపలికి ఇంకుతూ పోతుంది. ఆ ప్రయత్నములో ఏదో ఒక చోట రాయి తగిలితే ఆ రాతిని కరిగించి చిన్న రంధ్రము చేసి ఆ రంధ్రము గుండా ప్రయాణము చేస్తూ ఒక పెద్ద మార్గాన్ని ఏర్పరుస్తాయి.  గాలిలో ఉండే కార్బన్‌ డై ఆక్షైడ్ వలన నీరు ఆమ్లగుణము సంతరిందుకొని రాతిని తినివేస్తుంది. క్రమముగా రాయి కరిగిపోయి పగుళు గా తయారవుతుంది  , ఆ పగుళ్ళను నీరు మరింత విశాలము చేసుకుంటూ పోతాయి. ఫలితము గా ఒక గుహ ఏర్పడుతుంది.కొండల పైన పడిన వాననీరు ఈవిధముగా గుహలు ఏర్పడడానికి కారణమవుతుంది.

ప్రపంచము లో ఎన్నో గుహలు ఉన్నాయి . అతి పెద్ద గుహ 530 కి.మీ. పొడవు కలిగినది అమెరికాలో ఉన్నది . మన   దేశంలో  అజెంతా-ఎల్లోరా గుహలు ప్రసిద్ధి చెందినవి.

Post a Comment

0 Comments