GET MORE DETAILS

మార్స్‌పై పుట్టాను అందుకే ఇంత తెలివి. భవిష్యత్ చెప్పిన కుర్రాడు.

మార్స్‌పై పుట్టాను అందుకే ఇంత తెలివి. భవిష్యత్ చెప్పిన కుర్రాడు.
ఓ కుర్రాడు తాను అంగారక గ్రహం (Mars) నుంచి వచ్చానని చెప్పాడు. పైగా అతనికి విపరీతమైన తెలివితేటలున్నాయి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పాడు. ఆ సంగతులు తెలుసుకుందాం.


ఇప్పుడు ఎక్కడున్నాడు ?

ఇలా ఏలియన్ కథలు చెప్పే చాలా మంది మనలాగా ఉండకుండా తాము మిగతా వాళ్లకు భిన్నం అన్నట్లు వ్యవహరిస్తారు. కావాలనే ఎక్కడా కనిపించకుండా దాక్కున్నట్లు వ్యవహరిస్తారు. తద్వారా తాము ప్రత్యేకం అని చెప్పుకునేందుకు యత్నిస్తారు. ఈ కుర్రాడి విషయమూ అలాగే ఉంది. ఇతని పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఉన్నా అందులో ఇతని ఫొటోలు పెద్దగా లేవు. ఏడాది వయసప్పుడే న్యూస్ పేపర్ చదవగలిగిన ఈ కుర్రాడు.. తన తల్లితో కలిసి... రష్యాలోని ఓ మారుమూల గ్రామంలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. లేదంటే ఇతన్ని రష్యా వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం కస్టడీలోకి తీసుకొని ఉంటుందనే ప్రచారమూ సాగుతోంది. ఇలా కాందంటే ప్రభుత్వ కంట్రోల్‌లో ఉంటూ మారుమూల గ్రామంలో ఉంటున్నాడని మరో ప్రచారం ఉంది.

ఇలా ఏలియన్ కథలు చెప్పే చాలా మంది మనలాగా ఉండకుండా తాము మిగతా వాళ్లకు భిన్నం అన్నట్లు వ్యవహరిస్తారు. కావాలనే ఎక్కడా కనిపించకుండా దాక్కున్నట్లు వ్యవహరిస్తారు. తద్వారా తాము ప్రత్యేకం అని చెప్పుకునేందుకు యత్నిస్తారు. ఈ కుర్రాడి విషయమూ అలాగే ఉంది. ఇతని పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఉన్నా, అందులో ఇతని ఫొటోలు పెద్దగా లేవు. ఏడాది వయసప్పుడే న్యూస్ పేపర్ చదవగలిగిన ఈ కుర్రాడు తన తల్లితో కలిసి, రష్యాలోని ఓ మారుమూల గ్రామంలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. లేదంటే, ఇతన్ని రష్యా వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం కస్టడీలోకి తీసుకొని ఉంటుందనే ప్రచారమూ సాగుతోంది. ఇలా కాందంటే, ప్రభుత్వ కంట్రోల్‌లో ఉంటూ, మారుమూల గ్రామంలో ఉంటున్నాడని మరో ప్రచారం ఉంది.


ఇప్పుడు ఎక్కడున్నాడు ?

దాదాపు గంటపాటూ జరిగిన పాత ఇంటర్వ్యూలో బొరిస్కా కొన్ని నమ్మలేని విషయాలు చెప్పాడు. భూమికి ఉండే అయస్కాంత క్షేత్రాలు (Earth's magnetic fields) రివర్స్ అవుతాయి అని చెప్పాడు. భూమికి ఉత్తర, దక్షిణ ధృవాలతో అయస్కాంత క్షేత్రాలకు సంబంధం ఉంది. ఇతను చెప్పినట్లు ధృవాలు రివర్స్ అయితే నిజంగా అలా జరిగితే ఈ భూమిపై విపరీతమైన వాతావరణ మార్పులొస్తాయి. సైంటిస్టులు ఏం చెబుతున్నారంటే ఇలా 42,000 సంవత్సరాల కిందట ఓసారి జరిగిందట. అది చాలా ప్రమాదకరమైన ఘటన. అందువల్ల దానికి లాఛాంప్ ఘటన అని పేరు పెట్టారు (Laschamp" event). మళ్లీ అలాంటిది జరిగితే భూమిపై మనుషులే కాదు, ప్రాణులు, సముద్రాల్లోని జీవులు కూడా పెద్ద సంఖ్యలో చనిపోతాయి. అయస్కాంత క్షేత్రాలు బలహీనపడినా చాలు సూర్యుడి నుంచి కాస్మిక్ రేస్ వాతావరణంలోకి ప్రవేశించి రేడియేషన్ బాగా పెరిగిపోతుంది. ధృవాలు రివర్స్ అయితే వాతావరణంలో వేడి బాగా పెరిగిపోయి మరిన్ని ఎక్కువ తుఫాన్లు వస్తాయి.


ఈజిఫ్టులోని స్పింక్స్ (Sphinx) గురించి ఏం చెప్పాడు ?

బొరిస్కా తన వీడియో ఇంటర్వ్యూలో ఈజిఫ్టులోని పిరమిడ్ల దగ్గర మనిషి తల సింహం శరీరంతో ఉండే భారీ విగ్రహం స్పింక్స్ (Great Sphinx of Egypt) గురించి చిత్రమైన విషయం చెప్పాడు. ఆ స్పింక్స్ దగ్గర ఓ రహస్యం ఉందట. అది బయటపడితే భూమిపై లైఫ్ పూర్తిగా శాశ్వతంగా మారిపోతుంది అన్నాడు. మార్స్‌కి చెందిన తన గ్రహాంతరవాసులు (Mars Aliens) ప్రాచీన ఈజిఫ్టు వాసులతో బలమైన సంబంధాలు కలిగివుండేవారని తెలిపాడు. తాను మాత్రం తన గత జన్మలో ఈజిఫ్ట్ నుంచి మార్స్‌కి ఎగిరిపోయానని తెలిపాడు. ఆ జన్మలో తాను స్పేస్‌షిప్ పైలట్ అని చెప్పుకున్నాడు. స్పింక్స్ రహస్యం బయటపడాలంటే దాన్ని తెరవాల్సి ఉంది అన్నాడు బొరిస్కా. దాని చెవిలో దాన్ని తెరిచేందుకు ప్రత్యేక మెకానిజం ఉందనీ అది తనకు సరిగా గుర్తు లేదని చెప్పాడు. చెవి లోపల ఎక్కడో కీ దాచి ఉంచారని చెప్పాడు.


ఆ పిల్లలు వస్తారు... కాపాడతారు :

తనను తాను ఇండిగో చైల్డ్‌గా చెప్పుకున్న బొరిస్కా త్వరలో తన లాంటి ఇండిగో పిల్లలు (Indigo Children) వచ్చి భూమిని పెను విపత్తు నుంచి కాపాడతారని చెప్పాడు. గ్రహాంతర వాసుల్ని బాగా నమ్మేవారు. తరచూ ఈ ఇండిగో చిల్డ్రన్ పదాన్ని వాడుతుంటారు. ఆ పిల్లలు పుడతారు గానీ, భూమిపై మనుషులెవరినీ కలవరని బొరిస్కా తెలిపాడు. ఇప్పుడు చాలా మంది ఇండిగో చిల్డ్రన్ పదాన్ని వాడుతున్నారు. ఎవరైనా పిల్లలకు ప్రత్యేక గుణాలు ఉన్నా, మిగతా వారికి లేని అధిక తెలివితేటలు, ఎక్కువ ఐక్యూ వంటివి ఉంటే, వారిని ఇలా పిలుస్తున్నారు. భవిష్యత్‌లో పిల్లలు ఇలా ప్రత్యేక శక్తులతో పుడతారని నమ్ముతున్నారు.


అతను చెప్పిన ఆ రెండూ తప్పయ్యాయి :

2009, 2013లో రెండు భారీ విపత్తులు వస్తాయనీ తద్వారా అంతా అయిపోతుందన్నట్లు బొరిస్కా చెప్పాడు. 2009లో సునామీ వచ్చింది. 2013లో భారీ వరదలు వచ్చాయి. వీటివల్ల వేల మంది చనిపోయారు. అంతే తప్ప భూమి మొత్తం అంతరించిపోలేదు. అందువల్ల బొరిస్కా మాటలు నమ్మలేని పరిస్థితి ఉంది. పైగా,  అతను మార్స్‌పై పైలట్ అన్నాడు కానీ, మార్స్‌పై యుద్ధం జరిగి ఆ గ్రహం సర్వనాశనం అయిపోవడంతో, తాను భూమికి వచ్చానన్నాడు. కానీ అలా యుద్ధం జరిగినట్లుగా అంగారకగ్రహం మనకు ఎక్కడా కనిపించదు. అంతేకాదు, ఇప్పటికీ మార్స్‌పై కొందరు బతికే ఉన్నారనీ, వారు కొత్త లాడ్జిల నిర్మాణం, కొత్త ఆయుధాలను తయారుచేసే పనిలో ఉన్నారని చెప్పాడు. తనతోపాటూ మరికొంత మంది కూడా మార్స్ నుంచి వచ్చి భూమిపై జన్మించారని బొరిస్కా వివరించాడు. 


మార్షియన్స్ ఎలా ఉంటారంటే :

మార్స్‌పై ఉండేవారికి 35 ఏళ్లు అయ్యాక ఇక వయసు పెరగదనీ, వాళ్లు ఎప్పటికీ బతికివుంటారని చెప్పాడు. మరైతే యుద్ధంలో వారు ఎలా చనిపోయారన్నది తేలలేదు. మార్షియన్స్ పొడుగ్గా, టెక్నొలాజికల్‌గా చాలా అడ్వాన్స్డ్‌గా ఉంటారని బొరిస్కా అన్నాడు. వారు ఒక సూర్యుడి నుంచి మరో సూర్యుడి దగ్గరకు ప్రయాణించగలరు (interstellar travel) అని చెప్పాడు. మార్స్‌పై ఉండేవారు కార్బన్-డై-ఆక్సైడ్ పీల్చుతారనీ, వారు భూమికి వస్తే తమతోపాటూ దాన్ని తెచ్చుకుంటారని తెలిపాడు. ఇలా బొరిస్కా చెప్పిన విషయాలు అల్లకల్లోలంగా ఉన్నాయి. వేటికీ ఆధారం లేదు.

Post a Comment

0 Comments