GET MORE DETAILS

డ్వాక్రా సంఘాలకు ‘జగనన్న గోరుముద్ద’ తనిఖీ బాధ్యతలు...!

 డ్వాక్రా సంఘాలకు ‘జగనన్న గోరుముద్ద’ తనిఖీ బాధ్యతలు...!



పాఠశాలల్లో అమలు చేస్తున్న జగనన్న గోరుముద్ద పథకం తనిఖీ బాధ్యతలను ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు అప్పగించింది. గ్రామ సమాఖ్య(వీవో) లీడర్లు, యానిమేటర్లు, సీసీలు, ఆఫీస్‌ బేరర్లు విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించాలి. వీరు తమ పరిధిలోని ఏదో ఒక పాఠశాలను సందర్శించి జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా మధ్యాహ్న భోజనానికి అందిస్తున్న బియ్యం, కందిపప్పు, వేరుసెనగ చిక్కి, గుడ్ల పంపిణీ, వాటి పరిమాణం, నాణ్యతను పరిశీలించాలి. పిల్లలకు ఇస్తున్న భోజన నాణ్యత తనిఖీ చేయాలి. ఆ వివరాలను ఐఎంఎంఎస్‌ యాప్‌లో చిత్రాలతో సహా నమోదు చేయాలని జిల్లాలకు ఆదేశాలు జారీ అయ్యాయి.

Post a Comment

0 Comments