ఒమిక్రాన్ కలకలం.. బోట్స్‌వానా నుంచి వచ్చిన మహిళ కోసం వేట
కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ గుబులు రేపుతోంది. ఈ వేరియంట్ మొదట దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికాలోని బోట్స్‌వానా నుంచి భారత్‌కు వచ్చిన ఓ మహిళను పట్టుకునే ప్రయత్నంలో పడ్డారు అధికారులు. ఈ నెల 18న ఆమె మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌కు వచ్చినట్లు జబల్పుర్ వైద్యాధికారి డా.రత్నేష్ కురారియా తెలిపారు. ఆయన మాట్లాడుతూ..‘బోట్స్‌వానా దౌత్య కార్యాలయం నుంచి ఓ అధికారి మాకు ఫోన్ చేశారు. ఆ దేశం నుంచి వచ్చిన మహిళ.. జబల్‌పుర్‌లోని మిలిటరీ ఆర్గనైజేషన్‌లో ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. సదరు మహిళ ఫోన్ నంబర్, స్థానికంగా ఉన్న అడ్రస్‌ను షేర్ చేయమని వారితో చెప్పాం’ అని తెలిపారు.
సదరు మహిళ పేరు కునో ఓరెమీట్ సెలిన్ అని, ఆమె ఎక్కడుందో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని వైద్యాధికారి కురారియా పేర్కొన్నారు. రికార్డుల ప్రకారం.. సెలిన్ దిల్లీ నుంచి జబల్‌పుర్‌కు వచ్చినట్లు ఆయన తెలిపారు. జబల్‌పుర్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని.. పట్టణంలోని అన్ని హోటళ్లతోపాటు సరిహద్దు జిల్లాల నుంచి సమాచారం సేకరించామని పేర్కొన్నారు.
0 Comments