జనవరి 1 నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం
పుస్తకప్రియులు ఎదురుచూస్తున్న విజయవాడ పుస్తక మహోత్సవం జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పుస్తక మహోత్సవ కమిటీ సమన్వయకర్త విజయ్ కుమార్, అధ్యక్షుడు టి.మనోహర్ నాయుడు తెలిపారు. శనివారం గవర్నర్‌పేటలోని విజయవాడ పుస్తక మహోత్సవ కమిటీ గ్రంథాలయంలో వివరాలు వెల్లడించారు. విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. ఏటా మహోత్సవాలు నిర్వహించే స్వరాజ్యమైదానంలో లేదా చుట్టుగుంటలోని శాతవాహన కళాశాల మైదానంలో నిర్వహిస్తామన్నారు. ప్రస్తుత 32వ పుస్తక మహోత్సవ ప్రాంగణానికి సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు, నవోదయ పబ్లిషర్స్ అధినేత అట్లూరి రామమోహనరావు పేరు పెట్టామన్నారు. టి.మనోహర్ నాయుడు మాట్లాడుతూ.. ‘జనవరి 1న సాయంత్రం 6 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మహోత్సవం ప్రారంభిస్తారు. తర్వాత అట్లూరి రామమోహనరావు సంస్మరణ సభ, 4న పుస్తక ప్రియుల పాదయాత్ర, రోజూ వివిధ సామాజిక అంశాలపై చర్చలు, కవి సమ్మేళనం, గోష్ఠులు, పుస్తకావిష్కరణలు, సాహిత్య కార్యక్రమాలు ఉంటాయి. జనవరి 10న ముగింపు సభ, ఆ తర్వాతి రోజూ మహోత్సవం కొనసాగుతుంది’ అని వివరించారు.
0 Comments