GET MORE DETAILS

బడి ప్రాంగణాల్లోని సచివాలయాలు, ఆర్బీసీలను ఖాళీ చేయించాం

 బడి ప్రాంగణాల్లోని సచివాలయాలు, ఆర్బీసీలను ఖాళీ చేయించాం



రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1284 గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీసీ), ఆరోగ్య కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు గుర్తించామని, వాటిని ఈ ఏడాది సెప్టెంబరులో ఖాళీ చేయించామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌ ఈ మేరకు మెమో దాఖలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అసౌకర్యం కలిగే విధంగా గ్రామ సచివాలయాలు నిర్వహించడంపై దాఖలైన పలు వ్యాజ్యాల్లో విచారణ జరిపిన హైకోర్టు.. వాటిని తక్షణం తొలగించాలని 2020 జూన్‌లో ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలను అమలు చేయకపోవడంతో పలువురు ఉన్నతాధికారులపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. న్యాయస్థానం ఆదేశించాక సచివాలయాల తొలగింపునకు ఎప్పుడు చర్యలు తీసుకున్నారు? ఎన్ని ఖాళీ చేయించారు తదితర వివరాలను కోర్టు ముందు ఉంచాలని న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కోర్టులో మెమో దాఖలు చేసింది. 

జిల్లాల వారీగా వివరాలు: అనంతపురం 76, చిత్తూరు 129, తూర్పుగోదావరి 110, గుంటూరు 45, కృష్ణా 139, కర్నూలు 73, నెల్లూరు 157, ప్రకాశం 66, శ్రీకాకుళం 154, విశాఖపట్నం 123, విజయనగరం 48, పశ్చిమ గోదావరి 106, కడప 58.

Post a Comment

0 Comments