GET MORE DETAILS

17 సార్లు దాడులు జరిగే వరకూ శ్రీకృష్ణుడు జరాసంధుని చంపకుండా ఉద్దేశపూర్వకంగానే విడిచిపెట్టాడు. ఎందుకు ?

17 సార్లు దాడులు జరిగే వరకూ  శ్రీకృష్ణుడు  జరాసంధుని చంపకుండా ఉద్దేశపూర్వకంగానే విడిచిపెట్టాడు. ఎందుకు ?



శ్రీకృష్ణ భగవానుడు భూమి పై అవతారం దాల్చిన ప్రతిసారీ, ఆ అవతారం ధర్మ సంస్థాపనకు కారణమయిందని మనందరికీ తెలుసు. క్రమంగా శ్రీ కృష్ణుని అవతారం దాల్చినప్పుడు, కౌరవులందరికి గుణపాఠం బోధించడం, తన మేనమామ కంసుని సంహరించడం అతని ముందున్న ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. దాన్ని సాధి౦చుకొడానికి ఆయన తనకు గల ముఖ్యమైన స౦బ౦ధాలను ఆధారితంగా చేసుకున్నాడు. క్రమంగా పాండవులను తన పంచన చేర్చుకున్నాడు. తన భావోద్వేగాలను పక్కకు పెట్టి, తెలివిగా ఆడటం అంత తేలికైన విషయం కాదు. బహుశా ఈ కథ ద్వారా అటువంటి పాఠాన్నే తెలియజేసాడేమో మనందరికీ. కానీ, శ్రీ కృష్ణుని ప్రతి అడుగులోనూ యుక్తి దాగి ఉంటుందని గమనించాలి.

జాగ్రత్త మరియు తెలివిని ప్రదర్శించి ఆడటం :

కఠినమైన హృదయం కలిగి ఉన్నప్పటికీ, అసాధారణరీతిలో భావోద్వేగాల పరంగా ఉన్నత స్థాయిలో నిలిచాడు శ్రీకృష్ణుడు. ఏనాడు ఆవేశానికి పోలేదు, మరియు తన కోపావేశాలను అవసరమైన సమయంలోనే ప్రదర్శిస్తూ తెలివికి ఎక్కువగా పనిచేప్పేవాడు.

జరాసంధుడు శ్రీ కృష్ణుని మీద 17 సార్లు దాడి చేశాడు :

భీముడు జరాసంధుని రెండుగా చీల్చి సంహరించినట్లు మనకు ఇదివరకే తెలుసు. కానీ అంతకు ముందు శ్రీ కృష్ణుని మీద 17 సార్లు, జరాసంధుడు దాడులు నిర్వహించాడని చెప్పబడుతుంది. చంపగలిగిన శత్రువే అయినా, చంపే తెగింపు ధైర్యం శ్రీ కృష్ణునికి ఉన్నా, 17 సార్లు జరాసంధుని చంపకుండా ఉద్దేశపూర్వకంగానే విడిచిపెట్టాడు. అసలు ఎందుకని అంత కాలం వేచి చూశాడు అన్న ప్రశ్న సాధారణంగానే తలెత్తుతుంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు జరాసంధుడు ఎవరు...?

తన తల్లి దేవకీదేవి ద్వారా, కంసుడు కృష్ణునికి మేనమామ అవుతాడని మనందరికీ తెలుసు. అయితే జరాసంధుడు కంసుని మామ. శ్రీకృష్ణుడు కంసుని సంహరించిన తర్వాత, అది జరాసంధుని ఆగ్రహానికి కారణంగా మారింది. ఎట్టిపరిస్థితుల్లో జరాసంధుడు, శ్రీకృష్ణుని మట్టుబెట్టాలని కోరుకున్నాడు.

కృష్ణ భగవానుని చంపడానికి వచ్చిన జరాసంధుడు :

తన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి, శ్రీ కృష్ణుని సంహరించే క్రమంలో భాగంగా జరాసంధుడు తన సైన్యాన్ని తయారుచెయ్యడం ప్రారంభించాడు. తన జీవిత అంతిమ లక్ష్యం శ్రీ కృష్ణుని మరణం. కృష్ణుని పట్ల విరోధంగా ఉన్న ఇతర రాజులతో కలిసి తన లక్ష్యాన్ని వారితో పంచుకుని, శ్రీకృష్ణునికి శత్రువులుగా చేయనారంభించాడు.

జరాసంధుని ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చాయి.

శ్రీకృష్ణుడు నివసించే ద్వారక మీదకు దండెత్తడానికి వెళ్ళిన ప్రతిసారీ శ్రీ కృష్ణుడు పెళ్లి కొడుకు రూపంలో అయినా ఉండేవాడు, లేదా సైన్యాన్నంతా ఓడించి తననొక్కటే విడిచిపెట్టేవాడు. పురాణాల ప్రకారం జరాసంధుడు వివాహం చేసుకుంటున్న వారిని ఏమీ చేయడు. క్రమంగా నిరాశతో వెనుదిరగవలసి వచ్చేది. ఎన్నిమార్లు ప్రయత్నించినా, ఎంత శక్తిమంతమైన రాజ్యాలలోని రాజులను శ్రీ కృష్ణుని మీదకు ఉసిగొల్పినా ఓటమే చివరికి వరించేది. క్రమంగా జరాసంధుని ప్రయత్నాలన్నీ వ్యర్థమే అయ్యాయి. అయితే, అతని వైఫల్యం అతని నమ్మకాన్ని ఎన్నడూ బలహీనపర్చలేదు మరియు అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేదు. ఆ విధంగా శ్రీ కృష్ణుని సంహరించడానికి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా పదిహేడు సార్లు ప్రయత్నించాడు జరాసంధుడు. వచ్చిన ప్రతిసారీ కృష్ణుని చేతిలో ఓడిపోయి సైన్యాన్ని కోల్పోయి, వెనుతిరిగేవాడు. ఇక్కడ శ్రీ కృష్ణుని యుక్తి బాగా తెలుస్తుంది. యుద్ధం చేయడం అంటే శత్రువుని ఓడించడం కానీ, సంహరించడం కాదు అని. క్రమంగా యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధం చేశాడు, అవసరం లేదనుకున్న సమయంలో యుక్తిని ప్రదర్శించాడు.

అలా అయితే 17 వ దాడి తర్వాత శ్రీకృష్ణుడు ఎందుకని జరాసంధుని సంహరించవలసి వచ్చింది ?

పదిహేడు మార్లు జరాసంధుని ఏమీ చేయని శ్రీకృష్ణుడు, పద్దెనిమిదవసారి మాత్రం విడిచిపెట్టలేదు. నిజానికి జరాసంధుని పుట్టుక వెనుక ఒక కథ ఉంది., జరాసంధుడు తల్లి గర్భం నుండి జన్మించినప్పుడే రెండు భాగాలుగా జన్మించాడు. జరా అనే పేరుగల ఒక రాక్షస మహిళ, ఈ రెండు భాగాలను ఒకటిగా చేసింది. అందుచేత అతనికి జరాసంధుడు అని పేరు పెట్టడం జరిగింది. అతనికి మరో వరాన్ని కూడా ఆమె ప్రసాదించింది. జరాసంధుని ఎవరూ సంహరించలేరు, కేవలం అతని శరీరాన్ని విభజించి వ్యతిరేక దిశలో విసిరివేస్తే తప్ప. కావున దీనికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక అవసరం అవుతుంది. మరెలా సంహరించాడు ? ఇప్పుడు తెలుసుకుందాం.

జరాసంధుని మరణానికి కృష్ణుని ప్రణాళిక :

యుధిష్ఠిరుడు (ధర్మరాజు) రాజసూయ యాగము చేయాలని నిశ్చయించుకున్న సమయం వచ్చింది. అయితే, రాజసూయ యాగాన్ని నిర్వర్తించడం కోసం, ఒక రాజును చక్రవర్తిగా ప్రకటించి, ఇతర రాజులందరూ ఆతనిని తమ చక్రవర్తిగా అంగీకరించడం తప్పనిసరి చేశారు. కానీ జరాసంధుడు శ్రీకృష్ణుని చక్రవర్తిగా అంగీకరించడని తెలుసుకున్న యుధిష్టిరుడు కృష్ణుని సహాయం కోరుకున్నాడు.

భీమార్జునులు బ్రాహ్మణులుగా మారువేషం వేసి, జరాసంధుని కడకు వెళ్లి కుస్తీ సవాలు చేయమని కృష్ణుడు సూచించాడు. క్రమంగా ' భీముని' తో కుస్తీకి జరాసంధుడు అంగీకరించాడు. ఈ కుస్తీ పోటీ నాలుగు రోజుల పాటు కొనసాగగా, భీముడు జరాసంధుని సంహరించలేకపోయాడు. క్రమంగా కృష్ణుడు పూనుకోక తప్పలేదు. దూరం నుండి పోటీని పర్యవేక్షిస్తున్న శ్రీ కృష్ణుడు, జరాసంధుని సంహరించడానికి సూచనగా, భీమునికి కనపడేలా ఒక ఆకును ఉపయోగించి, రెండు ముక్కలుగా చేసి వివిధ దిశలలో విసిరేశాడు. మార్గదర్శకంగా, భీముడు జరాసంధుని సంహరించడంలో సఫలీకృతం అయ్యాడు. క్రమంగా జరాసంధుని శరీరాన్ని రెండు సగాలుగా చీల్చి, రెండు భాగాలను వేర్వేరు దిశల్లో విసిరి, వాటిని తిరిగి కలుసుకోనివ్వకుండా చేసి జరాసంధుని సంహరించాడు.

బలరాముని ప్రశ్నకు శ్రీకృష్ణుని సమాధానం :

కంసుని మద్దతుదారుడైన జరాసంధుని మరణం జరిగిన చాలాకాలం తర్వాత, బలరాముడు, కృష్ణుడు ఒక చర్చకు పూనుకున్నారు. బలరాముడు శ్రీ కృష్ణుని అన్న. చర్చ సందర్భంగా, అతన్ని సంహరించగలిగిన నువ్వు ఇంత కాలం ఎందుకు వేచి ఉన్నావు అని అడిగాడు బలరాముడు. క్రమంగా, శ్రీ కృష్ణుడు బలరామునికి ఇలా చెప్పాడు, ప్రతిసారి జరాసంధుడు దాడి చేసే నిమిత్తం కొత్త సైన్యంతో వచ్చేవాడు. ఈ సైన్య౦లో అత్యంత శక్తిమ౦తులైన రాజులతో సహా భూమ్మీద ఉండే అనేకమంది దుష్ట ప్రజలు కూడా ఉన్నారు. క్రమంగా వారందరినీ ఒకే చోట మట్టుబెట్టే అవకాశం వచ్చింది. అలా దుష్టులను జరాసంధుడు తీసుకుని వచ్చేవాడు, నేను వారిని సంహరించేవాడిని. అని బదులిచ్చాడు. ఈ సమాధానం కారణంగా, శ్రీ కృష్ణుని మేధస్సును, ప్రజ్ఞాపాఠవాలను, యుక్తిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు బలరాముడు.

అంతేకాకుండా మరొక కథనం కూడా ఉంది. మరియు ముఖ్యమైనది. భీముడు, బకాసురుడు, కీచకుడు, జరాసంధుడు, దుర్యోధనుడు, ఈ 5 మంది ఒకే నక్షత్రంలో జన్మించారు. వీరి వీరి జాతకాల ప్రకారం, వీరిలో ఎవరు ముందుగా మరొకరి చేతిలో హతమవుతారో మిగిలిన ముగ్గురు కూడా వారి చేతిలోనే మరణిస్తారు. క్రమంగా ఏకచక్రపురంలో పాండవులు నివసిస్తున్న సమయంలో, అంతగా తెలివిలేని బకాసురుడు ముందుగా భీముని చేతిలో సంహరించబడేలా శ్రీకృష్ణుడు ప్రణాళిక రచించాడు. క్రమంగా మిగిలిన ముగ్గురు కూడా భీముని చేతిలోనే మరణించవలసి ఉన్నది. అందుచేత ఆ అవకాశాన్ని భీమునికి ఇవ్వాలన్న కారణంగా కూడా జరాసంధుని సంహరించకుండా ఎదురుచూడవలసి వచ్చింది. సమయం వచ్చేలోపు, సమయాన్ని వృధా చేయకుండా మిగిలిన దుష్టులను మట్టికరిపించాడు శ్రీ కృష్ణ పరమాత్ముడు.

Post a Comment

0 Comments