కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2022
దేశవ్యాప్తంగా ఉన్న 21 నేషనల్ లా యూనివర్సిటీల కన్సార్టియం అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2022 ప్రకటన విడుదల చేసింది.
యూజీ ప్రోగ్రాం (ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ) :
అర్హత: ఇంటర్ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత. 2022 మార్చి/ ఏప్రిల్‌లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులే. 2) పీజీ ప్రోగ్రాం (ఏడాది ఎల్‌ఎల్‌ఎం డిగ్రీ)
అర్హత: ఎల్‌ఎల్‌బీ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత. 2022 ఏప్రిల్/ మేలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులే.
ఎంపిక విధానం: క్లాట్ 2021 పరీక్ష (ఆఫ్‌లైన్) ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.4000, ఎస్సీ/ ఎస్టీ/ బీపీఎల్ విద్యార్థులకు రూ.3500.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, జనవరి 01.
దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 31.
పరీక్ష తేది: 2022, మే 08.
వెబ్‌సైట్: https://consortiumofnlus.ac.in/
0 Comments