GET MORE DETAILS

ఫీజుల ఖరారు ప్రక్రియ సరికాదు - 53, 54 జీవోలు రద్దు : : విద్యా సంస్థల ప్రతిపాదనల తర్వాతే నిర్ణయం తీసుకోండి_మార్చి నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి కావాలి: హైకోర్టు

 ఫీజుల ఖరారు ప్రక్రియ సరికాదు - 53, 54 జీవోలు రద్దు : : విద్యా సంస్థల ప్రతిపాదనల తర్వాతే నిర్ణయం తీసుకోండి_మార్చి నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి కావాలి: హైకోర్టు



 భౌగోళికంగా ప్రాంతాల వారీగా పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఫీజులు ఖరారు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఆగస్టు 24వ తేదీన జారీ చేసిన జీవో 53,54ను రద్దు చేసింది. ఫీజుల ఖరారు అంశంలో విద్యాసంస్థల వర్గీకరణ ప్రధాన భాగమని మౌలిక సదుపాయాలను పరిగణన లోకి తీసుకుని వర్గీకరణ జరిపిన అనంతరం ఫీజుల ప్రతిపాదనలు, ఇతర రికార్డులను తెప్పించుకుని మేరకు ఫీజులను సిఫార్సు చేయాల్సిందిగా పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషను ఆదేశించింది. వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని స్పష్టం చేసింది, వర్గీకరణ, భౌగోళిక ప్రాంతం ఆధారంగా వేర్వేరు ఫీజులను ఖరారు చేయాలని సూచించింది. ప్రభుత్వం ఖరారు చేయనున్న ఫీజుల కంటే 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే ఆయా సంస్థలు అధికంగా ఫీజులు వసూలు చేస్తే ఆ మిగిలిన మొత్తాన్ని విద్యార్థులకు తిరిగి చెల్లించాలని యాజమాన్యాలను ఆదేశించింది. ఫీజులు ఎక్కువగా ఉంటే వసూలు చేసుకునే వీలు కల్పించింది. ఫీజుల ఖరారుపై ప్రభుత్వం జారీచేసిన జీవో 53, 54ను సవాల్ చేస్తూ తూర్పుగోదావరి ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్, ఏపీ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల యాజమా న్యాల సంఘం, ఇతర సంస్థలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు సోమవారం తీర్పును వెలువరించారు. ఓ గ్రామంలో ప్రపంచ ప్రమాణాలతో ఏర్పాటైన పాఠశాలకు, అద గ్రామ పరిధిలో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేని పాఠశాలకు ఒకేవిధంగా ఫీజులు ఎలా వసూలు చేస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు, ఇది సహేతుకం కాదన్నారు. గంగానది ఉన్నత శిఖరాల నుంచి చిన్న మురికి వాగులా ఎలా మారిందో విద్యక వాడా దాతృత్వం, పరోపకారం లాంటి ఉన్నతాశయాల్లో నుంచి ఓ వృత్తిగా, పరిశ్రమగా, చివరకు జీవనోపాధిగా మారటం దురదృష్టకరమని వ్యాఖ్యానిం చారు. విద్యా సంస్థల వర్గీకరణ ప్రధాన అంశమని చెప్తూ మౌలిక సదుపాయా లను పరిగణనలోకి తీసుకుని సంస్థల నుంచి ఫీజుల ప్రతిపాదనలు, ఇతర రికార్డులను పరిశీలించిన అనంతరం 2020-21, 2022-2023, 2023-24 బ్లాక్ పీరియడ్ కు ఫీజులు సిఫార్సు చేయాల్సిందిగా కమిషన్ను హైకోర్టు ఆదేశించింది.

Post a Comment

0 Comments