GET MORE DETAILS

ఉద్యోగుల 70 డిమాండ్లపై సజ్జలతో చర్చించాం: బండి శ్రీనివాస్

 ఉద్యోగుల 70 డిమాండ్లపై సజ్జలతో చర్చించాం: బండి శ్రీనివాస్ఉద్యోగుల 70 డిమాండ్లపై సజ్జలతో చర్చించామని ఉద్యోగ సంఘం నేత శ్రీనివాస్‌ తెలిపారు. 14.29 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని సీఎస్ కమిటీ చెప్పడం సరికాదన్నారు. సీఎస్ కమిటీ సిఫార్సులు ప్రభుత్వానికి మేలు చేసేవే కాని ఉద్యోగులకు మేలు చేసేవి కాదన్నారు. 55 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని సజ్జలను కోరామన్నారు. హామీలు అమలయ్యేవరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. 1-7-2018 నుంచి 55 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలన్నదే తమ డిమాండ్ అన్నారు. తమ డిమాండ్లపై సీఎం సానుకూలంగా ఉన్నారని భావిస్తున్నామని పేర్కొన్నారు.

Post a Comment

0 Comments