నోటీస్ బోర్డు - ఏపీలో 90 మెడికల్ పోస్టులు
ఆంధ్రపదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య, విధాన పరిషత్ వివిధ జిల్లా ఆసుపత్రుల్లో, ఏరియా ఆసుపత్రుల్లోని ఆర్‌టీపీసీఆర్ ల్యాబ్స్‌లో పని చేయడానికి ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 90
పోస్టులు: రిసెర్చ్ సైంటిస్ట్, రిసెర్చ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంటీఎస్.
ఖాళీలున్న ప్రాంతాలు: మదనపల్లె (చిత్తూరు)-15, ప్రొద్దుటూరు (కడప)-15, రాజమహేంద్రవరం (తూర్పు గోదావరి)-30, నంద్యాల (కర్నూలు)-30.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా (ఎంఎల్‌టీ), ఏదైనా డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎండీ ఉత్తీర్ణత, అనుభవం.
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, సర్వీస్ వెయిటేజ్, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేది: 2021, డిసెంబరు 22, 27, 29.
వెబ్‌సైట్: https://kurnool.ap.gov.in
0 Comments