GET MORE DETAILS

బూస్టర్‌ డోసుగా భారత్‌ బయోటెక్‌ చుక్కలమందు టీకా! దీనికి ఇంజెక్షన్‌ అవసరం లేదు. ఇప్పటికే రెండో దశ క్లినికల్‌ పరీక్షలు పూర్తి

 బూస్టర్‌ డోసుగా భారత్‌ బయోటెక్‌ చుక్కలమందు టీకా! దీనికి ఇంజెక్షన్‌ అవసరం లేదు. ఇప్పటికే రెండో దశ క్లినికల్‌ పరీక్షలు పూర్తి



కొవిడ్‌-19 వ్యాధి నిరోధం కోసం ఇప్పటికే రెండు డోసుల టీకా తీసుకున్న వారికి ‘బూస్టర్‌ డోసు’ కింద తాము అభివృద్ధి చేస్తున్న ముక్కులో వేసే చుక్కలమందు (నాసల్‌ వ్యాక్సిన్‌) టీకా (బీబీవీ154) ఇస్తే పూర్తి రక్షణ లభిస్తుందని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ భావిస్తోంది. ఈ టీకాపై మూడో దశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి అనుమతి కోరుతూ భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ)కి దరఖాస్తు చేసింది. ఇప్పటికే దీనిపై రెండో దశ క్లినికల్‌ పరీక్షలను కంపెనీ పూర్తి చేసింది. రెండు డోసుల ‘కొవాగ్జిన్‌’ టీకా తీసుకున్న వారికి, ‘బూస్టర్‌’ కింద ముక్కులో వేసే చుక్కలమందు టీకా ఇచ్చి పరీక్షించింది. ఫలితాలు సంతృప్తికరంగా వచ్చినందున, మూడో దశ పరీక్షలు నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నట్లు భారత్‌ బయోటెక్‌ తెలిసింది. దీనికి ఇంజెక్షన్‌తో పనిలేదు. కేవలం ముక్కులో చుక్కలు వేస్తే సరిపోతుంది. కొవాగ్జిన్‌తో పాటు ఇతర సంస్థల కొవిడ్‌-19 టీకా రెండు డోసులు తీసుకున్న వారికి, ‘బూస్టర్‌’ కింద ఈ చుక్కల మందు టీకా ఇవ్వవచ్చని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. దీనిపై మూడో దశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించటానికి అనుమతి ఇవ్వాలని డీసీజీఐని భారత్‌ బయోటెక్‌ వర్గాలు కోరినట్లు సమాచారం. అనుమతి లభించిన వెంటనే పరీక్షలను ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయాలని భావిస్తున్నట్లు కంపెనీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఏడాది వరకు గడువు :

'కొవాగ్జిన్‌’ టీకా ఉత్పత్తి అయిన తేదీ నుంచి ఒక ఏడాది కాలం వరకు వాడుకునేందుకు (షెల్ఫ్‌ లైఫ్‌) డీసీజీఐ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు భారత్‌ బయోటెక్‌ పేర్కొంది. తమ వద్ద నిల్వ ఉన్న టీకా డోసులను ఆసుపత్రులు వినియోగించవచ్చని పేర్కొన్నాయి. ‘కొవాగ్జిన్‌’ టీకా ప్రస్తుతం 10 మందికి లేదా 20 మందికి సరిపడా వయల్‌ రూపంలో లభిస్తోంది. ఒకసారి వయల్‌ను తెరిచాక, దాన్ని అప్పటికప్పుడే పూర్తిగా వినియోగించాల్సిన అవసరం లేదు. 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేస్తే 28 రోజుల పాటు వినియోగించవచ్చు. దీనివల్ల టీకా వృథా కాకుండా నివారించినట్లు అవుతుందని భారత్‌ బయోటెక్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Post a Comment

0 Comments