Ads Area

కొన్ని మొక్కలు జంతువులను తింటాయెందుకు ?

0

కొన్ని మొక్కలు జంతువులను తింటాయెందుకు ?



సాధారణంగా మొక్కలు, చెట్లు కిరణజన్య సంయోగ క్రియ (photo synthesis)వలన ఆహారం తయారుచేసుకుంటాయి. మొక్కలలో ఉన్న హరిత పదార్థము (chlorofil), సూర్యరస్మి (sun light), భూమి(మట్టి)లోని (clay) నత్రజని సహాయంతో తమకు కావల్సినంత ఆహారాన్ని తయారుచేసుకుంటాయి. కొన్ని మొక్కలు నత్రజని లోపించిన ముఖ్యంగా బురద నేలలలో పెరుగుతాయి. ఇవి తమకు కావలసిన నత్రజనిని తయారుచేసుకోలేవు. నత్రజని కోసమే కీటకాలను తింటాయి.

క్రిములను, కీటకాలను, చిన్న జంతువులను తినే మొక్కలను కీటకాహార మొక్కలు లేదా మాంసభక్షణ మొక్కలు ( Insectivorous or Carnivorous plants) అంటారు. ఇవి చాలా ఆశ్చర్యకరమైనవి. ఈ మొక్కలు నత్రజని లోపించిన ముఖ్యంగా బురద నేలలలో పెరుగుతాయి. ఇవి తమకు కావలసిన నత్రజనిని తయారుచేసుకోలేవు. అందువల్ల ఈ విధంగా క్రిమికీటకాలలో లభించే మాంసకృత్తుల మీద ఆధారపడతాయి. ఈ మొక్కల పత్రాలు కీటకాలను ఆకర్షించి, పట్టుకొని, చంపి, జీర్ణం చేసుకోవడానికి అనువుగా బోనులుగా రూపాంతరం చెందుతాయి. ఈ పత్రాలను 'బోను పత్రాలు' అంటారు. ఈ పత్రాలు వివిధ ఎంజైములను స్రవించడం వలన కీటకాలలోని ప్రోటీనులు విశ్లేషించి జీర్ణం చేయబడతాయి. జీర్ణం చేయబడిన ప్రోటీనులను ఈ పత్రాలు శోషిస్తాయి. ఇవి ఉత్తర, దక్షిణ కరోలినా (usa), ప్రాంతాల్లో అగుపిస్తాయి. 

కీటకాహార మొక్కలకు ఉదాహరణలు: నెపెంథిస్, డ్రోసిరా, యుట్రిక్యులేరియా,డయోనియా, సర్రెసీనియా, ఆల్ డ్రోవాండా, వీనస్ ఫ్లై ట్రాప్ (venus flytrap), పిచ్చర్ మొక్క(pitcher plant) మరియు సన్ డ్యూ (sundew) మొక్క.

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area