GET MORE DETAILS

భయపడకండి అంటూ, ఓమిక్రాన్_వైరస్ గురించి ఓ డాక్టర్ ప్రజలకు ధైర్యాన్ని అందిస్తూ, అప్రమత్తత చేస్తూ రాసిన వ్యాసం ఇది.

 భయపడకండి అంటూ, ఓమిక్రాన్_వైరస్ గురించి ఓ డాక్టర్ ప్రజలకు ధైర్యాన్ని అందిస్తూ, అప్రమత్తత చేస్తూ రాసిన వ్యాసం ఇది.



1) ఎవరికి డేంజర్?  : భయపడే వార్తలను పదేపదే చదివే వారికి,  వినేవారికి డేంజర్ . వారి భయమే వారి పాలిట శాపంగా మారుతుంది . ఓమిక్రాన్ చంపదు. భయం ముంచేస్తుంది . ముందుగా ఆల్ఫా వైరస్ వచ్చింది .  అటుపై దాని కంటే అనేక రెట్ల వేగం  తో  విస్తరించే డెల్టా వచ్చింది . ఇప్పుడు అంతకంటే ఎక్కువ వేగంతో ఓమిక్రాన్ . కట్టడి చర్యల పేరుతొ మీ భయాన్ని మార్కెటింగ్ చేసుకొనే ప్రయత్నాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి . కరోనా ను నుంచి ముక్కున్న  మానవుడు తప్పించుకోలేడు   అని నేను ప్రారంభం నుంచి చెబుతున్నాను . కరోనా పోతుంది అని ఇంకా నమ్మే అమాయక ప్రజలు కోకొల్లలుగా వున్నారు . కరోనా ఎక్కడికీ పోదు. మరో వంద ఏళ్ళైనా ఉంటుంది . మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో స్పానిష్ ఫ్లూ కలుగ చేసిన వైరస్ ఇంకా మన  మధ్యే వుంది . అది సాధారణ  జలుబు కలుగ చేస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధ కాలం లో అది ప్రాణాంతకం అయిన మాట వాస్తవం . కానీ మ్యుటేషన్ లు జరిగే కొద్దీ బలహీన పడి జలుబు ఫ్లూ వైరస్ గా నిలిచిపోయింది  . కరోనా కూడా  అంతే .. ఒళ్ళు నొప్పుల వైరస్ గానో మరో స్వల్ప లక్షణాలు కలుగచేసే వైరస్ గా నో స్థిరపడి పోతుంది. మీ జీవిత కాలం   లో ఎన్నో సార్లు సోకుతుంది . సోకినా ఏమీ కాదు . భయపడే వ్యక్తిని ఎవరూ రక్షించలేరు .

2) ఓమిక్రాన్ కు మోనోక్లోనల్ యాంటీబోడీ కాక్టెయిల్ పనిచేసే అవకాశం తక్కువ . విపరీతంగా  భయపడే వారు , లేదా ఇమ్మ్యూనిటీ మరీ బలహీనంగా ఉన్న వారు తప్పించి మిగతా వారికి దీని అవసరం రాదు .

3) మ్యుటేషన్ ల కు గురికావడం సూక్షజీవుల సహజ లక్షణం . { ఆ మాటకు వస్తే అన్ని జీవులు . కాకపోతే సూక్షజీవుల పై ప్రభావం ఎక్కువ } . ఓమిక్రాన్ రేపు మరో రూపం లో కి మారొచ్చు. దాన్ని ఆపలేము . దాన్ని పట్టించుకోవలసిన అవసరం లేదు . మన ఇమ్మ్యూనిటి నే మనకు రక్ష.

దానికోసం

1. ప్రతి రోజు కనీసం అరగంట ఎండ లో నడవండి . శరీరానికి డి విటమిన్ అందివ్వండి. 2. శాఖాహారులు బి 12  విటమిన్ మాత్రలు తీసుకోండి . 

3. తినే ఆహారం లో ప్రోటీన్ లు ఎక్కువగా { కనీసం ముప్పై శాతం } ఉండేలా చూసుకోండి . పన్నీర్ , మొలికెత్తిన పెసలు , పుట్టగొడుగులు , బ్రోకలీ , జామ కాయ , చికెన్ , ఫిష్ మటన్ , గుడ్డులు ప్రోటీన్ అందించే ఆహార పదార్థాలు.

4. రోజుకు పెద్దలు నాలుగు లీటర్ల నీరు తాగాలి . చెమట పట్టేదాకా వ్యాయామం { కనీసం నడక } చెయ్యాలి . 5. శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వాలి . నిద్ర బాగా పోవాలి . ఇవన్నీ ఇమ్మ్యూనిటి ని బలపరుచుకొనే మార్గాలు.    

అన్నింటికన్నా భయమే పెద్ద విలన్  .. భయం ఇమ్మ్యూనిటి ని చంపేస్తుంది. అదే ఫార్మసురుల అస్త్రం. భయం తో మళ్ళీ మీ ఆస్తులు ఖాళీ చేసి వారి గోదాముల్లో నోట్ల కట్టలు సంచుల్లో దాచుకొనే అవకాశాన్ని కల్పించుకొంటున్నారు . తస్మాత్ జాగ్రత్త . వేవ్ అంటే ఆసుపత్రిల్లో బెడ్ లు దొరకపోవడం , అంబులెన్సు ల క్యూలు .. ఇలాంటి స్థితి రాదు . కానీ మన దేశం లో కరోనా అంటే భయపడే వారు కోకొల్లలుగా వున్నారు . ఇన్నాళ్లయినా నిజాన్ని గ్రహించలేని వారు , భయం  వద్దని చెబితే మొండిగా,  మూర్ఖంగా వాదించేవారు వున్నారు . వారిని    ఓమిక్రాన్ నుంచి ఎవరూ రక్షించలేరు . తత్త్వం బోధపడేటప్పటికీ వారు ఉండక పోవచ్చు .. ఉన్నా ఆస్తులు పోగొట్టుకొని అనారోగ్యం తో .. ఇలా చెబుతున్నందుకు సారీ . నిజం  నిష్టూరంగా ఉంటుంది . తప్పదు.

భయాన్ని బహిష్కరించండి. నిర్భయంగా వుండండి . అప్రమత్తత అవసరం . అలసట అనిపిస్తే పల్స్ ఆక్సీ మీటర్ లో ఆక్సిజన్ శాతం వారం రోజుల పాటు రోజుకు ఒక సారి చెక్ చేసుకోండి . అది 94  పైగా ఉంటే హ్యాపీగా గా కాలం గడపండి.

Post a Comment

0 Comments