GET MORE DETAILS

కనుమరుగవుతున్న పండుగల కళలు...!

 కనుమరుగవుతున్న పండుగల కళలు...!
 


అనేక సంస్కృతీ సంప్రదాయాలకు నిల యమైనది భారతదేశం. ఎన్నోపండుగలు, మరెన్నో వ్రతాలు,ఇంకెన్నో యజ్ఞయాగాదులు ఆచరించడం భారత సంస్కృతిలో ఒకభాగం. అలాంటి సంప్రదాయాలకు నిలయమైన దేశంలో ప్రతి మాసానికి, పండుగకు ఒక విశిష్టత ఉంది. ఒక ప్రత్యేకత ఉంది. ఆ పండుగల వెనుక ఆధ్యాత్మికత, ధార్మిక ఆరోగ్యరహస్యాలు ఎన్నో ఇమిడి ఉన్నాయి. అలాంటి పండుగల్లో ఉత్తమోత్త మైనదిగా సంక్రాంతి పండుగను భావిస్తారు.దక్షిణాయనం ముగిసి మకరరాశిలో సూర్యుడు ప్రవేశించే పుణ్యకాలంలోనే ఈ పండుగను నిర్వహిస్తారు. ఈ పండుగే కాదు దసరా కానీ, దీపావళి కానీ, ఉగాది కానీ ఏ పండుగను తీసుకు న్నా ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క ప్రత్యేక విశిష్టత, కారణం, దాని వెనుక మరెన్నో గాధలున్నాయి. సంక్రాంతికి ఒకప్రత్యేకత ఉంది. ఎటుచూసినా ప్రకృతిపచ్చగా, హాయిగా ఆహ్లాదకరంగా కన్పించే కాలం ఇది. ఇతర పండుగలన్నీ చాంద్రమానాన్ని అనుసరించి జరిగితే సంక్రాంతి సూర్య మానాన్ని అనుసరించి నిర్వహించుకుంటారు.

ఈ పండుగ తోనే సూర్యుడి గమన దిశ మారుతుంది. తెలుగు రాష్ట్రా ల్లోనే కాదు సంక్రాంతి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాలతో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచంలోని కూడా కొన్ని దేశాలు ఈ పండుగను వివిధ పేర్లతో జరుపుకుంటాయి. మరికొన్ని ప్రాంతాల్లో దసరా పండుగకు ప్రాముఖ్యత ఇస్తారు. కానీ రానురాను ఆ పండుగల వాతావరణం తగ్గిపోతున్నదేమోననిపిస్తున్నది. జీవనశైలిలో వస్తున్న మార్పుల కారణంగా పండుగ కళలు గ్రామాల్లో అంతగా కన్పించడం లేదు.ప్రస్తుతం పండుగ అంటేనే పెద్దగా ఆసక్తి చూపించని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వివిధ ఒత్తిడులు, సమాజంలో వచ్చిన మార్పుల కారణం గా పండుగలకు దూరమవ్ఞతున్నారేమోనపిస్తున్నది. భోగి, సంక్రాంతి, కనుమ అంటూ ఈ పండుగను మూడు రోజులు చేసుకుంటారు. పిండివంటలు చేసుకునే తీరికా, ఓపిక లేకపోవడంతో బేకరీలకో, స్వీట్‌ దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు.

నేటితరం వారిలో కొందరికి ఆనాటి పిండివంటలు చేసే విధానం కూడా తెలియడం లేదు. ఒకవేళ తెలిసినా అందుకు అవసరమైన సామాగ్రి సమకూర్చుకునేందుకు సదుపాయాలు లేకపోవడం, బయటి దుకాణాలపైనే ఆధారపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పిండివంటలు తయారు చేయడంలో ఒకరికొకరు సహాయపడేవారు. గ్రామాల్లో పండుగలు కోలాహలంతో ఆహ్లాదకరంగా ఉండేవి. ఇక కోడి పందెలు నిర్వహించడం కూడా కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయం. కేవలం వినోదంకోసం ప్రారంభమైన ఈ కోడి పందెలు ఇప్పుడు లక్షలాది రూపాయలు బెట్టింగులు పెట్టే జూదంగా మారిపోయింది. దీంతో పోలీసులు దీనిని నిషేధించారు. అయినా కోడి పందెలు జూదం మాదిరిగానే జరుగు తున్నాయి. ఇక ఎడ్లబండ్లు పోటీలు కొన్ని ప్రాంతాలకే పరిమితమైపోయాయి.

రానురాను ఆనాటి సంప్రదాయాలు, కళలు కనుమరుగైపోతున్నాయనే ఆవేదన వ్యక్తమవ్ఞతున్నది. ఆంగ్ల సంవత్సరాది జనవరి ఒకటో తేదీకి ఇచ్చే ప్రాధాన్యత కూడా మన పండుగలకు ఇవ్వడం లేదనే విమర్శలు కూడా వెల్లుబుకుతున్నాయి. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం క్రమేణా నగరాలను దాటి కుగ్రామాలకు సైతం పాకిపోతు న్నది. గ్రామీణ జనజీవన స్రవంతిలో విలీనమైభాసిల్లుతున్న మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే కూచిపూడి, భరతనాట్యం, జానపద కళలు, బుర్రకథలు, హరికథలు, పాశ్చాత్యనాగరికత వెల్లువ, ఆధునిక ముసుగులో కనుమరుగైపోతున్నాయి. అనేక మతాలు, కులాల అంతరాల దొంతర్లపై నిర్మితమైన మన కళాసంస్కృతిని కాపాడుకోలేమోననిపిస్తున్నది. గతంలో ఈ పండుగల సందర్భంగా జరిగే ఉత్సవాలు కానీ, జాతరలు, తిరునాళ్లు ఆయా ప్రాంతాల ఆచారవ్యవహారాలకు అద్దంపట్టే నాటకాలు, పగటివేషాలు, గంగిరెద్దులు కోలాహలంతో ఎంతో ఆహ్లాదకరంగా ప్రదర్శనలు జరిగేవి.

పండుగ దినాల్లో కూడా ఇలాంటి కళలతో పాటు కోలాటం, భజనలు చేస్తూ గడిపేవారు. ప్రతి కళారూపం మన సంస్కృతికి అద్దంపట్టడమేకాక ప్రజలకు ధర్మాధర్మా వివేచనను, ఆలోచనల్లో ఉజ్జీవనం పెంపొందించేందుకు ఉపయుక్తంగా ఉండేవి. మనం వేసే ప్రతి అడుగులోనూ మన సంస్కృతి, నాగరికత విశిష్టత పరిమళాలు గుబాళిస్తుండేవి.ప్రతి మాటలో సభ్యత, సంస్కారం తొణికిసలాడుతుండేవి. కానీ అవి రానురాను కనుమరుగైపోతున్నాయి. వాటిస్థానంలో రికార్డ్‌డాన్స్‌లు, ప్రజల ముందు అంగంగా ప్రదర్శనలతో గ్రామాలు సైతం మత్తు సీమలుగా మారిపోతున్నాయి. మద్యం అమ్మకాలు పండుగల సందర్భంగా ఐదారు రెట్లు పెరిగిపోతున్నాయి.ఇక కనుమ పండుగను పశువ్ఞల పండుగగా భావిస్తారు. పశువ్ఞలకు పూజచేస్తారు. ముఖ్యంగా గోవ్ఞను తల్లిగా ఆరాధించడం మన సంస్కృతిలో ఒకభాగం. గోపూజ చేయడం ఆచారంగా వస్తున్నది.గోవ్ఞకు, మనుషులకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. పాడిపంటలకే కాకుండా ఇంటిల్లిపాదికి పాడి ఆవ్ఞ కామధేనువే.గో సంపద కూడా తగ్గిపోతున్న ది.కనుమరుగైపోతున్న మన సంప్రదాయాలను, ధర్మా ధర్మాలను పండుగల విశిష్టతను గ్రామీణులకు వివరించి కాపాడే ప్రయత్నాలు అంతగా జరగడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి సంస్థలు చేపడుతున్న అవి నగరాలకే పరిమితమవ్ఞతున్నాయి.

ఈ సేవా ధార్మిక కార్య క్రమాలు గ్రామాలకుచేరితే వాటి లక్ష్యానికి చేరువకావడానికి ఆస్కారంఉంది.అంతేకాదు మన సంస్కృతి విశిష్టతలను, సంప్రదాయాలను పండుగల ప్రాధాన్యతలపై మఠాధిపతు లు, స్వామిజీలు చేసే ఆసక్తికరమైన ఆధ్యాత్మిక ప్రసంగాలు, ఇతిహాసపురాణగాధలు,నిరుపేద, మధ్యతరగతి గ్రామీణులకు అందాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛంద సంస్థలు, మేధావ్ఞ లు కల్పించుకొని మన సంస్కృతి, సంప్రదాయాలను రక్షిం చేందుకు సంసిద్ధులు కావాలి. ప్రజల భాగస్వామ్యమే మన సంస్కృతి పరిరక్షణకు ఏకైక మార్గం.

Post a Comment

0 Comments