GET MORE DETAILS

భీష్ముడు

భీష్ముడు 
మహాభారతంలో భీష్ముని పాత్ర మహనీయము. ఆ పేరులో ఉన్న గాంభీర్యం ఎక్కడా కనబడదు. శంతనుడు గంగాదేవికి  జన్మించిన అష్టవసువులలో చివరివాడు.ఇతడు గంగాదేవి పుత్రుడైనందున గాంగేయుడు అనిపేరు. శంతనుడు ఇతనికి దేవ్రతుడని పేరు పెట్టాడు.పెరిగి పెద్ద్దయ్యాక పరశురాముడి వద్ద ధనుర్విద్యను అస్త్రశస్త్రవిద్యను అభ్యసించాడు. 

తన తండ్రియైన  శంతనుడు మత్స్యరాజు (దాశరాజు)కుమార్తె సత్యవతి ని వివాహమాడదలచి విచారంగా ఉండడం గమనించాడు. 

దేవవ్రతుడు మత్స్యరాజు వద్దకు వెళ్లి అతని కుమార్తె సత్యవతిని తన తండ్రి కిచ్చి వివాహం చేయమని కోరాడు. మత్స్యరాజు నిరాకరించి తనకుాతురుకు పుట్టబోయే కుమారుడే రాజు కావలెనని కాని నీవు పెద్దవాడైనందున నిన్ను రాజును చేస్తారు కనుక తన కిష్టంలేదన్నాడు. దేవవ్రతుడు తాను రాజ్యాన్ని త్యజిస్తున్నానని సత్యవతి కుమారుడినే రాజును చేయగలనని చెప్పాడు. అయినను సంతృప్తి చెందని మత్స్యరాజు "నీవు కాకపోయినా నీకు పుట్టబోయే సంతానం రాజ్యాన్నికోరుకుంటారని" అన్నాడు. 

"అటువంటి సంశయం ఉంటే పంచభూతాల సాక్షిగా సుార్యచంద్రుల సాక్షిగా నేను నా జీవితంలో పెళ్ళి చేసుకోకుండా బ్రహ్మచారి గానే ఉంటాను" అని భీషణమైన ప్రతిజ్ఞ చేసాడు. భీష్ముడిగా పిలువ బడినాడు.

శంతనుడు సత్యవతిని వివాహమాడాడు.తన కోసం త్యాగం చేసిన తన కుమారునికి తన ఇష్టపుార్వకంగానే మరణం సంభవిస్తుందని వరం ఇచ్చాడు.సత్యవతి శంతనులకు విచిత్రుడు,వీర్యుడు అను ఇద్దరు కుమారులు కలిగారు. వీరికి యుక్త వయసు వచ్చింది.భీష్ముడు అంబ   అంబిక   అంబాలిక అనే రాజకుమార్తెలను ఒక స్వయంవరం నుండి తీసుకుని వచ్చాడు. 

అంబ తాను సాళ్వరాజు ను ప్రేమించానని తెలిపింది. భీష్ముడు అంబను పంపించి అంబిక అంబాలికలను విచిత్ర వీర్యులకు ఇచ్చి వివాహం చేసాడు. అంబను సాళ్వరాజు నిరాకరించాడు.తాను భీష్ముని చేరి వివాహమాడమని వేడుకుంది. భీష్ముడు తన ప్రతిజ్ఞను గుర్తు చేసి ఒప్పుకోలేదు. అంబ క్రోధంతో భీష్ముని అంతుచుాస్తానని వెళ్లిపోయింది. 

కొంతకాలం తర్వాత విచిత్ర వీర్యులు యుద్ధంలో మరణించారు. అప్పటికి సంతానం కాలేదు. అంబిక అంబాలికలకు వేదవ్యాసుని వరంతో దృతరాష్ట్రుడు పుట్టు గ్రుడ్డియైనవాడు అంబాలికకు పాండురోగంతో పాండురాజు జన్మించాడు. వారి దాసికి విదురుడు జన్మించాడు. పాండురాజు మరణించగా దృతరాష్ట్రుడు మహా రాజయ్యాడు. కురువంశాన్ని  రాజ్యాన్ని రక్షించే బాధ్యత భీష్ముడు తీసుకున్నాడు. 

రాజుకు రాజ్యానికి పుార్తి విధేయుడైనందున దుర్యోధనుడి పన్నాగాలను ద్రౌపది వస్త్రాపహరణం పాండవుల అరణ్యవాసం కురు పాండవుల యుద్ధము ఆపలేకపోయాడు. ఈ అన్యాయాన్ని ఆపమని దృతరాష్ట్రుడిని ఎంతకోరినా పుత్రప్రేమతో వినిపించుకోలేదు. 

రాజ్యానికి విధేయుడైనందున పదునెనిమిది రోజుల కురుక్షేత్ర యుద్ధములో కౌరవుల పక్షాన సర్వ సైన్యాధ్యక్షుడై తొమ్మిది రోజులు యుద్ధము చేసాడు. చివరికి తాను యుద్ధము చేయకుండా ఉండడానికి అవకాశం ఎలా అని ధర్మరాజు అడుగగా తెలిపాడు. 

మరుసటిరోజు శిఖండి ని ముందుంచుకొని అర్జునుడు బాణాలు వేయగా భీష్ముడు విల్లంబులు వదిలేసాడు.(శిఖండి గత జన్మలో అంబ) అర్జునుడి బాణాలకు భీష్ముడు క్రింద పడిపోగా అనేక బాణాలతో అంపశయ్య ఏర్పాటు చేసారు. అర్జునుడు భుామిలోకి బాణం వేయగా వచ్చిన నీటితో దాహం తీర్చుకున్నాడు కురుక్షేత్ర సంగ్రామం ముగిసేవరకు జీవించి ఉన్నాడు. 

పాండవులు యుద్ధములో గెలిచాక ధర్మ రాజుకు రాజధర్మం ఇంకా మనిషి జీవన విధానాలు బోధించాడు.( అనుశాసనిక పర్వంలో ఉన్నాయి) సుార్యుడు దక్షిణాయం నుండి ఉత్తరాయణం లో ప్రవేశించాక తన ఇచ్ఛానుసారముగా (తండ్రి వరంతో) స్వర్గస్తడయ్యాడు.

Post a Comment

0 Comments