GET MORE DETAILS

సంగీత ఝరి, స్వరామృత ధార, ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి

 సంగీత ఝరి, స్వరామృత ధార, ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి
ఎం.ఎస్.సుబ్బులక్ష్మి లేదా ఎం.ఎస్.గా పేరుగాంచిన మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (1916 సెప్టెంబర్ 16 – 2004 డిసెంబర్ 11) కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని , నటి. ఈమె భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. 1974 లో రామన్ మెగసెసె పురస్కారం పొందినప్పుడు అవార్డు ప్రదాతలు ప్రకటిస్తూ కర్ణాటక సంగీత శ్రోతల్లో తీవ్రమైన స్వచ్ఛతావాదులు శ్రీమతి. ఎం. ఎస్. సుబ్బులక్ష్మిని కర్ణాటక సంగీతపు శాస్త్రీయ, అర్థ-శాస్త్రీయ గీతాలాపనలో ప్రస్తుతపు ప్రధాన విశేషంగా పరిగణిస్తారు అని వ్యాఖ్యానించారు.

సంగీత ఝరి, స్వరామృత ధార, ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి :

కర్ణాటక సంగీత ఝరి..ఎన్నటికీ వాడని మల్లెల సౌరభ సంగీత సుగంధం..ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి. సూర్యచంద్రులు ఉన్నంత వరకూ ఆమె సంగీతం అలరారుతుంది. ‘ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పేరుగాంచిన మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి. ప్రముక కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని, నటి. భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి ఎం.ఎస్ సుబ్బులక్ష్మి.

1916 సెప్టెంబర్ 16న మధురై జన్మించింది ఈ మధుర గాంధర్వ కళాకారణి ఎం.ఎస్ సుబ్బులక్ష్మి. ఆమె ఆహార్యం ఎన్నటికీ మరువరానిది. నుదుటిని కుంకుమతో..తలలో ఎప్పుడూ మల్లెపూలతో గొంతెత్తి పాడుతున్న ఆమె ఆహార్యం భారతీయుల గుండెల్లో చిరకాలం నిలిచిపోతుంది. 11 డిసెంబర్ 2004లో చెన్నై కన్నుమూశారు సుబ్బులక్ష్మిగారు.

తమిళనాడు మదురైలో సుబ్రహ్మణ్య అయ్యర్, వీణావాద్య విద్యాంసురాలు షణ్ముఖవడివు అమ్మాళ్ కు 1916 సెప్టెంబర్ 16 న జన్మించింది సుబ్బులక్ష్మి. చిన్నారి సుబ్బులక్ష్మిని ఆమె తల్లి ముద్దుగా కుంజమ్మ అని పిలుచుకునేవారు. ఆమె భారతీయ సంప్రదాయాన్ని, సంస్కారాన్ని అమితంగా ప్రేమించేది

తన ప్రతిభతకో చాలా తక్కువ సమయంలోనే భారతజాతి గర్వించతగ్గ అంతర్జాతీయ సంగీత సామ్రాజ్ఞిగా ఎదిగింది. 1926 లో 10 సంవత్సరాల వయసులో గుడిలో పాటలు పాడడంతో తన తొలి సంగీత ప్రదర్శన ప్రారంభమై..సంగీత ప్రియులను తన మధుర స్వరంతో సంగీతంలో ఓలలాడించారు.

1940 వ సంవత్సరంలో శకుంతలై అన్న తమిళ సినిమాలో ఆమె తొలిసారిగా గాయక నటిగా తెరపై కనిపించింది. 1945 వ సంవత్సరంలో నిర్మించబడిన ‘మీరా’ చిత్రం హిందీలో పునర్నిర్మించబడి కూడా విజయవంతం కావడంతో సుబ్బులక్ష్మి పేరు భారతదేశమంతటికీ సుపరిచితమయింది.

భక్తిగాయనిగా సుబ్బులక్ష్మి పేరు ప్రఖ్యాతులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంలో సదాశివన్ కృషి ఎంతో ఉందనే మరచిపోకూడదు.

ఆమె గాత్రం, సోత్రం, గానం, గీతం అజరామరం :

ఎం.ఎస్.సుబ్బలక్ష్మీ విగ్రహం. తిరుపతిలో సుబ్బులక్ష్మి పాడుతుంటే స్వయంగా అమ్మవారే పాడుతున్నట్లు భావించేవారు. నిండైన విగ్రహం, భారతీయతకు ప్రతీకగా పట్టుచీరతో, నుదుటి మీద ఎర్రటి కుంకుమబొట్టు, చేతుల నిండా గాజులు, కళ్లకు నిండుగా కాటుక, కొప్పు, కొప్పు నిండా మల్లెపూలు, చేతిలో తంబూర పట్టుకొని సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గానలహరిలో మునిగిపోయేవారు.

మైమరచిపోయేవారు.కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైనది. గానం ధ్యానంలా సాగేది. పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలును, శాస్త్రీయ, లలిత గీతాలను, భజనలు, జానపద గేయాలు, మరాఠీలో అభంగాలు, దేశభక్తి గేయాలు కూడా పాడారు. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాషా నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం సుబ్బులక్ష్మి ప్రత్యేకత. శృతి, లయ, ఆలపనతో పాటు భావాన్ని, భక్తిని సమపాళ్ళలో వ్యక్తీకరించడంతోపాటు పామరులను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం ఆమెకు మాత్రమే సాధ్యం! ముఖ్యంగా సంక్లిష్ట సమాసాలతో కూడిన సంస్కృత భాషలోని భావం దెబ్బతినకుండా అలవోకగా ఆలపించడం ఆమె సాధన ద్వారా సాధించుకున్న గొప్ప వరం. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి వంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు సుబ్బులక్ష్మి తన గాత్రం ద్వారా ప్రాణం పోశారు.

మహాత్మాగాంధీ ప్రశంసించిన మహనీయురాలు సుబ్బులక్ష్మి :

మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన వైష్ణవ జనతో, జె పీర్ పరాయీ జానేరే వంటి గీతాలకు ప్రాణం పోసిన మహనీయురాలు ఎం.ఎస్ సుబ్బులక్ష్మి. ప్రార్థన సమయములో ఎవరయిన అలా లీనమవాల్సిందే. ఓ భజన కీర్తనలను మొక్కుబడిగా పాడటం వేరు, దైవ చింతనలో లీనమవడం వేరు అని మహాత్మా గాంధీ ఆమెను ప్రశంసించారు.

ఐక్యరాజ్యసమితిలో గానం చేసి చరిత్రలో నిలిచిపోయిన ఎం.ఎస్. సుబ్బులక్ష్మి : 

ఐక్య రాజ్య సమితిలో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు సుబ్బులక్ష్మిగారు. ఆమె సంగీతం, పాటల గురించి చెప్పుకోవాలంటే ఒక యుగం కూడా సరిపోదు.

వర్థంతి సందర్భంగా వారిని తలచుకుందాం...వారి స్మృతులతో...

Post a Comment

0 Comments