GET MORE DETAILS

విద్యార్థులకు ఉపకారం : ఎన్ ఎం ఎం ఎస్

 విద్యార్థులకు ఉపకారం : ఎన్ ఎం ఎం ఎస్పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక పరిస్థితులు అడ్డుపడుతుంటాయి. ప్రతిభ ఉన్నా సహకారం లేకపోవడంతో మధ్యలోనే చదువు ఆపేస్తున్న వారు ఎంతో ఉన్నారు. అటువంటి చిన్నారుల భవిష్యత్తుకు భరోసానిస్తూ కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రతిభ ఉపకార వేతనం(నేషనల్‌ మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్‌షిప్‌) అందించనుంది. త్వరలో నిర్వహించే పరీక్షకు ప్రణాళికా బద్ధంగా కసరత్తు చేస్తే విజయం సాధించడం సులభమని ఉపాధ్యాయ నిపుణులు సూచిస్తున్నారు.

ప్రశ్నాపత్రం ఇలా... మొత్తం 180 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. 90 మార్కులకు రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌, మెంటల్‌ ఎబిలిటీ, జనరల్‌ ఇంగ్లిషు ఉండగా.. మరో 90 మార్కులకు ఏడో తరగతి, ఎనిమిదో తరగతి గణితం, సైన్సు, సాంఘిక శాస్త్రం, పాఠ్యాంశాలపై ప్రశ్నలుంటాయి.

మొదటి పేపరులో...

* జనరల్‌ నాలెడ్జ్‌, మెంటల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌కు సంబంధించిన పేపరులో మొత్తం 90 మార్కులకు ఉంటుంది. ఇందులో ఆడ్‌మ్యాన్‌ అవుట్‌ నుంచి ఇచ్చే 10 మార్కులు సులుభంగా సాధించవచ్చు. రాష్ట్రాల రాజధానుల గురించి తెలుసుకోవడం వల్ల సులభంగా 5 మార్కులు సాధించవచ్చు. పక్షలు, జంతువుల బొమ్మల ఇచ్చి అల్ఫాబేటికల్‌ అర్డర్‌లో రాయమంటారు. ఇలా మరో పది మార్కులు విద్యార్థులు సులభంగా సాధించవచ్చు. 

* వెన్‌ చిత్రాలు పది మార్కులకు వస్తాయి. ఇవి తరచుగా సాధన చేస్తే సులభంగా ఉంటుంది. ఇవి ప్రతి రోజు ఓ గంటపాటు సాధన చేస్తే విద్యార్థికి ఏ అంకెకు ఏ అక్షరమనేది గుర్తుంటుంది. సులభంగా 15 మార్కులు సాధించవచ్చు.

ఏడో తరగతి కీలకం...

రెండో పేపరు మొత్తం 90 మార్కులకు ఉంటుంది. ఇందులో గణితం 20 మార్కులు, సాంఘిక, సామాన్య శాస్త్రాల నుంచి 70 మార్కులు ఉంటాయి. ఏడో తరగతి పూర్తిగా, ఎనిమిదో తరగతి నవంబరు సిలబస్‌ వరకు విద్యార్థి చదివి ఉండాలి. గణితంలో వడ్డీ, చక్రవడ్డీ, రేఖాగణిత సమస్యలపై అధికంగా ప్రశ్నలు ఇస్తుంటారు. సామాన్య శాస్త్రంలో మానవ శరీర నిర్మాణం, మొక్కల ఎదుగుదల, పాఠ్యాంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి.

గతేడాది జిల్లాలో 2612 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయగా 192 మంది ఎంపికయ్యారు.

పెరిగిన ప్రోత్సాహకం : పరీక్షలో ప్రతిభ చూపిన వారికి గతంలో ఏడాదికి రూ.6 వేలు చొప్పున నాలుగేళ్లకు రూ.24 వేలు ఇచ్చేవారు. ఇప్పుడు రూ.12 వేల చొప్పున నాలుగేళ్లకు రూ.48 వేలు ఇస్తున్నారు.

రోజూ ఆరు గంటలు కష్టపడ్డా :

6, 7, 8 తరగతుల్లో ఫిజిక్స్‌, బయాలజీ, రసాయన శాస్త్రం, బయాలజీ పుస్తకాలు చదవడంతో పాటు అధ్యాపకుల సూచనలు పాటించడం వల్ల విజయం సాధించా. రోజూ ఆరు గంటలు సాధన చేశా. గత ఏడాది కరోనా కారణంగా పాఠశాలలు కొన్ని రోజులు తెరవలేదు. ఆ సమయంలో ఈ పరీక్షకు సమయం కేటాయించా. 

- అశ్వదాటి వరలక్ష్మి, 9వ తరగతి, తాడిగడప జడ్పీ పాఠశాల

రీజనింగ్‌పై పట్టు అవసరం : జె.శ్రావణి, ఆగిరిపల్లి

రీజనింగ్‌పై పట్టు సాధిస్తే ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షలో విజయం సాధించవచ్చు. రోజూ సాధ్యమైనన్ని ఎక్కువ సమస్యలను సాధన చేసి సాధించా. భౌతిక, జీవ, గణితం, సాంఘిక శాస్త్రాల్లో ముఖ్యమైన పాఠ్యాంశాలపై ఎక్కువ దృష్టి సారించా. విజయం సాధించడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది.

ప్రణాళికతో చదివితే విజయం : ఎన్‌.లీల, ఈదర

ఏ రోజు ఏది చదవాలో ప్రణాళికా వేసుకుని చదివా. మంచి ఫలితాలు సాధించా. నేను రోజూ కనీసం ఆరు గంటలు ఈ పరీక్ష కోసమే కేటాయించా. ఉపాధ్యాయులను అడిగి సందేహాలు నివృత్తి చేసుకున్నా. పోటీ పరీక్ష ఎలా ఉంటుందో అర్థమైంది.

మంచి అవకాశం :

ప్రభుత్వం ఉపకార వేతనం కింద ఇచ్చే నగదు పెంచింది. ఆ డబ్బు పేద విద్యార్థులకు ఎంతో ప్రయోజనం. ఏటా మా పాఠశాలలో పరీక్ష కోసం విద్యార్థులను ప్రత్యేకంగా సన్నద్ధం చేస్తున్నాం.

- పి.పుష్పలత, ప్రధానోపాధ్యాయిని


Post a Comment

0 Comments