GET MORE DETAILS

జ్ఞాపకశక్తిలో తుమ్మల గురుశంకర్‌ కు గిన్నిస్‌బుక్‌లో చోటు

 జ్ఞాపకశక్తిలో తుమ్మల గురుశంకర్‌ కు గిన్నిస్‌బుక్‌లో చోటు



గణితంపై తనకున్న ఆసక్తికి తండ్రి ప్రోత్సాహం తోడవ్వడంతో ‘మోస్ట్‌ డెసిమల్‌ ప్లేసెస్‌ ఇన్‌ యూలర్స్‌ నంబర్‌ను’ గుర్తు పెట్టుకోవడంపై సాధన చేసి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో చోటు సంపాదించారు రైల్వేకోడూరు పట్టణం కొత్త కృష్ణానగర్‌ చెందిన తుమ్మల గురుశంకర్‌ (28). తుమ్మల శివయ్య, సుభాషిణి దంపతుల కుమారుడైన ఇతను వ్యక్తిత్వ వికాస శిక్షకుడిగా విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ ఇస్తూ జీవనం సాగిస్తున్నారు. యూలర్స్‌ నంబరంటే 2.718281..... అనంతం (ఇన్ఫినిటీ ). ఇలా 2. తరువాత వరుస క్రమంలో వచ్చే 7777 డెసిమల్‌ స్థానాలను గుర్తుపెట్టుకుని ఇదివరకు ఉన్న 5005 స్థానాల రికార్డును అధిగమించారు. దీంతో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ ఇతడికి ‘మోస్ట్‌ డెసిమల్‌ ప్లేసెస్‌ ఇన్‌ యూలర్స్‌ నంబర్‌ మెమరైజ్డ్‌’ రికార్డును అంతర్జాల వెబ్‌సైట్‌లో ప్రకటించింది.

ఏడాది నుంచి సాధన : ఈసందర్భంగా గురుశంకర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసిన తన తండ్రి తుమ్మల శివయ్య గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లో చోటు సాధించేలా ఏదైనా సాధించాలని చిన్నప్పటి నుంచి తనను ప్రోత్సహించే వారని చెప్పారు. కొన్ని నెలల కిందట అనారోగ్యంతో తండ్రి మృతి చెందారన్నారు. ఏడాది నుంచి యూలర్స్‌ సంఖ్యను గుర్తుంచుకోవడంపై సాధన చేస్తున్న తాను తండ్రి మరణం తరువాత మరింత పట్టుదలతో ప్రయత్నించానని వివరించారు.

Post a Comment

0 Comments