GET MORE DETAILS

ఆరోగ్యం స్వీయవరం : : ఎక్కువగా తినకూడదు - డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రీజీ

ఆరోగ్యం స్వీయవరం : : ఎక్కువగా తినకూడదు - డాక్టర్  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ



మరీ ఎక్కువగా తినకూడదు. ఆకలి ఎంత ఉంటే అంతే తినాలి. ఆకలి లేకపోతే నోట్లోకి ఒక్క ముద్ద కూడా పోకూడదు. ఆకలి ఎంత ఉంటే అంత, కొద్ది కొద్దిగా ఉన్న ఆకలి సగం తీరడానికి ఒక ఇడ్లీనో, ఒక వడనో, ఒక అరటి పండునో తింటూ, ఒక నాలుగైదుగంటల తర్వాత ఒక ద్రాక్ష గుత్తినో లేకపోతే ఒక ఖర్జూరపు కాయనో తింటూ, లేకపోతే ఒక చక్కటి సగం దోసెనో తింటూ, లేకపోతే చక్కటి ఆలుగడ్డను ఉడికించుకునో తినాలి.


ఆకలిగా వున్నప్పుడే...!

 ఒక్క మాంసాహారం తప్పితే మరి ఏదైనా మన ఇష్టం! ఏదైనా తినొచ్చు, మాంసాహారం తప్పితే! అదీ అప్పుడప్పుడూ కొద్దికొద్దిగా ఆకలి ఉన్నప్పుడు మాత్రమే కొంచెం కొంచెంగా తింటూ, మరి జిహ్వ యొక్క గ్రంధుల సంతృప్తి కోసం, రసాస్వాదం కోసం కొంచెం కొంచెం ఇస్తూ ఉండాలి.

     ఆరోగ్యానికి కావలసింది మట్టుకు ప్రాథమికంగా 'ఆత్మశక్తి' మాత్రమే! 'నేను ఆత్మను' అనే భావనలో నిరంతరం ఉండటం ద్వారా, 'ప్రాణశక్తి' ని "ఆనాపానసతి" ద్వారా పొందుతూ మరి ఎంతో నీటిని త్రాగుతూ, అప్పుడప్పుడూ రెండు గంటలకు, మూడు గంటలకు ఒకసారి ఒకానొక ముద్ద నోట్లోకి పంపిస్తుంటే, అదే సరైన ఆహార విధానమౌతుంది.

Post a Comment

0 Comments