GET MORE DETAILS

విద్యుత్‌ ఉద్యోగుల పిఆర్‌సిపై కమిటీ - బిల్లుపై అసెంబ్లీలో తీర్మానం : ఉద్యోగుల జెఎసి డిమాండ్‌

 విద్యుత్‌ ఉద్యోగుల పిఆర్‌సిపై కమిటీ - బిల్లుపై అసెంబ్లీలో తీర్మానం : ఉద్యోగుల జెఎసి డిమాండ్‌



విద్యుత్‌ ఉద్యోగుల వేతన సవరణ కోసం కమిటీ(పిఆర్‌సి)ని ఏర్పాటు చేయాలని విద్యుత్‌ ఉద్యోగుల జెఎసి డిమాండ్‌ చేసింది. జెఎసి కార్యాచరణ సమితి సమావేశం విజయవాడలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జెఎసి చైర్మన్‌ పి చంద్రశేఖర్‌, సెక్రటరీ జనరల్‌ పి ప్రతాప్‌ రెడ్డి, కన్వీనర్‌ సాయికృష్ణ మాట్లాడుతూ 2022 ఏప్రిల్‌ 1 నుంచి 2026 మార్చి 31కి సంబంధించిన పిఆర్‌సిపై ఇప్పటి వరకు కమిటీ నియమించలేదన్నారు. తమ సమస్యలను పరిష్కరిస్తామని ఏడాది క్రితం ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో యాజమాన్యం నుంచి ఎంఓఎం పొందామన్నారు. అయినా, ఇప్పటివరకు దీనిని అమలు చేయకపోగా విచారణలు, కేసుల పేరుతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. విద్యుత్‌ రంగాన్ని ప్రైవేట్‌పరం చేసే విద్యుత్‌ చట్ట సవరణ - 2021కు వ్యతిరేకంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేశాయని చెప్పారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. ట్రాన్స్‌కో, డిస్కాంలలో సబ్‌స్టేషన్ల ఆటోమేషన్‌ సిస్టం, పంపిణీ రంగ పథకం(ఆర్‌డిఎస్‌ఎస్‌) అమలు నిలిపివేయాలని కోరారు.

పవర్‌ యుటిలిటీస్‌కు సంబంధించి అన్ని ప్రారంభ కేడర్లలో రిక్రూట్‌మెంట్‌ చేయాలని, తద్వారా ప్రస్తుత ఉద్యోగులపై పనిఒత్తిడి తగ్గించాలని డిమాండ్‌ చేశారు. జెఎల్‌ఎం గ్రేడ్‌ కారుణ్య నియామకాలను అమలు పరిచి క్రమబద్ధీకరించాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ రంగ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్ల ఆఫీస్‌ బేరర్‌లకు మేనేజ్‌మెంట్‌ జారీ చేసిన బలవంతపు బదిలీలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. గతంలో ఉన్నట్లు ఉద్యోగ సంఘాలు, సిఎండి స్థాయి యాజమాన్యాల మధ్య సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చించడానికి అవకాశం ఉండే వాతావరణాన్ని కల్పించాలన్నారు.

Post a Comment

0 Comments