Ads Area

మళ్లీ ప్రిలిమ్స్‌? - ఎపిపిఎస్‌సి ఆలోచన

0

 మళ్లీ ప్రిలిమ్స్‌? - ఎపిపిఎస్‌సి ఆలోచన



ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎపిపిఎస్‌సి) మళ్లీ ప్రిలిమ్స్‌ పరీక్షలు నిర్వహించే ఆలోచన చేస్తోంది. గ్రూప్‌-1 పోస్టులకు మినహా మిగిలిన పోస్టులకు ఒకే పరీక్ష ఉంటుందని కమిషన్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగా రాష్ట్రప్రభుత్వం జిఓ 39,150లను రద్దు చేసింది. అయితే కొంతమంది అభ్యర్థులు మరలా ప్రిలిమ్స్‌ను నిర్వహించాలని కమిషన్‌ను కోరుతున్నారని ఎపిపిఎస్‌సి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒకే పరీక్ష వల్ల అభ్యర్థులు నష్టపోతారను అభిప్రాయం వ్యక్తమవుతోందని ఆయన అన్నారు. దీంతో ప్రిలిమ్స్‌ నిర్వహణపై మళ్ళీ ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ ప్రిలిమ్స్‌ నిర్వహిస్తే ప్రస్తుతం కమిషన్‌ విడుదల చేసిన నోటిఫికేషన్లు, పెండింగ్‌లో ఉన్న వాటికి వర్తిస్తాయా? లేదా అన్న అంశంపై కూడా చర్చ సాగుతోంది

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area