GET MORE DETAILS

ప్రత్యేక పూజలు, వ్రతాలు చేసేటపుడు, వివాహ సమయంలో కంకణం ఎందుకు ధరిస్తారు ?

ప్రత్యేక పూజలు, వ్రతాలు చేసేటపుడు, వివాహ సమయంలో కంకణం ఎందుకు ధరిస్తారు ?



శుభకార్యం సమయంలో కంకణాన్ని మణికట్టుకు ధరించాలని ధర్మశాస్త్రం చెబుతున్నది. ఒక సంకల్పానికి, ధర్మానికి కట్టుబడి ఉండటం కోసం కంకణ ధారణ ఆచారం ఏర్పడింది.

వివాహ వ్రత యజ్ఞేషు శ్రాద్ధే హోమేర్చనే జపే

ఆరబ్ధే సూతకం నస్యాద నారబ్ధేతు సూతకం॥

వివాహం, యజ్ఞం, వ్రతాదులు ‘సంకల్ప కంకణ ధారణ’తోనే మొదలవుతాయి. కంకణ ధారణ చేసిన తర్వాత ఆ శుభకార్యం పూర్తయ్యే వరకు సూతకం వంటి ఏ దోషాలూ కంకణం కట్టుకున్నవారికి వర్తించవు. అందుకే వివాహం, యజ్ఞాలు, ఇతర శుభకార్యాలు చేసినప్పుడు కంకణాన్ని ధరించడమనే నియమం ఏర్పడింది. సర్వేశ్వరుడైన సుదర్శనుడు ఆ శుభకార్యానికి రక్షగా ఉంటాడని విశ్వాసం. సంకల్పించిన శుభకార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి కంకణ ధారణ సహకరిస్తుంది. కంకణ దారం మూడు పోగులతో గానీ, ఐదు పోగులతో గానీ (బేసి సంఖ్య) ఉండాలి. దానిని మామిడి ఆకుతో గానీ, తమలపాకుతో గానీ, పసుపు కొమ్ముతో గానీ అలంకరించి పూజిస్తారు. ఈ కంకణాన్ని కట్టుకునేటప్పుడు ప్రశాంత మనసు, దృఢ సంకల్పం, నిర్మల భక్తి కలిగి ఉండాలి. కంకణాన్ని పురుషులు కుడిచేతికి, స్త్రీలు ఎడమచేతికి ధరించాలి.

ఒకనాడు గౌతమ బుద్ధుడి దగ్గరికి అయిదుగురు పండితులు వచ్చి తమ వివాదాన్ని పరిష్కరించమని కోరుతారు. వాళ్లలో ఒకరు ‘భగవంతుడు ఇలాంటివాడు, అలాంటివాడు, అతణ్ని పొందటానికి మార్గం ఇదని నా గ్రంథం అంటున్నద’ని చెబుతాడు. మరొకరు లేచి ‘అయ్యా! అది బొత్తిగా తప్పు. దేవుడు ఫలానా లక్షణాలు కలిగినవాడు. అతణ్ని సాక్షాత్కరించుకోవాలంటే మా గ్రంథం నిర్దేశించిన మార్గంలో పయనించాలి’ అంటాడు. ఇలా అందరూ వాళ్లకు నచ్చిన రీతిలో పరమాత్మను నిర్వచించారు.

అవన్నీ సావధానంగా ఆలకించిన తథాగతుడు ‘దేవుడు ఆగ్రహిస్తాడని, ఎవరినైనా ఎప్పుడైనా హింసిస్తాడని, అతడు స్వార్థపరుడని, అపవిత్రుడని, సంకుచిత స్వభావుడని మీ గ్రంథాలు చెబుతున్నాయా?’ అని ప్రశ్నిస్తాడు. అందరూ మూకుమ్మడిగా ‘లేదు స్వామీ! దేవుడు పరమ పవిత్రుడని, దయామయుడని, మంగళ స్వరూపుడని మా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి’ అని చెబుతారు. అప్పుడు సిద్ధార్థుడు గంభీర వదనంతో వారిని చూస్తూ ‘అయితే మీరు పరిశుద్ధులు, సాధుశీలురు అయితే సరిపోతుంది కదా! అప్పుడే మీరు భగవంతుడిని ఎలాంటివాడో అర్థం చేసుకోగలుగుతారు. అలా కాకపోతే ఎంత వాదించినా ప్రయోజనం లేదు’ అని హితవుప లుకుతాడు.

Post a Comment

0 Comments