GET MORE DETAILS

విశ్వదేవతలు

విశ్వదేవతలు



సాధ్యులు : సాధ్య, ధర్ముల కుమారులు. దక్షప్రజాపతి మనుమలు. విశ్వదేవతలు లేక విశ్వకుమారులు.

మరుత్వంతులు : మరుత్వతి, ధర్ముల కుమారులు. దక్షప్రజాపతి మనుమలు. విశ్వదేవతలు లేక విశ్వకుమారులు.

వసువులు : వసువు ధర్ముల కుమారులు. దక్షప్రజాపతి మనుమలు. విశ్వదేవతలు లేక విశ్వకుమారులు. వీరు నాలుగు దిక్కుల వ్యాపించిన జ్యోతిష్మంతులు. వీరిలోని ప్రభాసుడే భీష్ముడు. గంగాదేవి శంతన మహారాజు బిడ్డలు.

భానవులు : భనవి ధర్ముల కుమారులు. దక్షప్రజాపతి మనుమలు. విశ్వదేవతలు లేక విశ్వకుమారులు.

ముహూర్తజులు : ముహూర్త ధర్ముల కుమారులు. దక్షప్రజాపతి మనుమలు. విశ్వదేవతలు లేక విశ్వకుమారులు.

ఘోషులు : లంబ ధర్ముల కుమారులు. దక్షప్రజాపతి మనుమలు. విశ్వదేవతలు లేక విశ్వకుమారులు.

సంకల్పులు : సంకల్ప ధర్ముల కుమారులు. దక్షప్రజాపతి మనుమలు. విశ్వదేవతలు.

భూతల వాసులు : అరుంధతి ధర్ముల కుమారులు. దక్షప్రజాపతి మనుమలు. విశ్వదేవతలు లేక విశ్వకుమారులు.


అష్టవసువులు :

అష్టవసులులు : అపుడు, ధృవుడు, సోముడు, ధరుడు, అనిలుడు, ఆనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు.

అపుని కుమారులు : శ్రాంతుడు, వేతంతుడు, అపిశ్రాంతుడు, బభ్రువు. వీరు యజ్ఞరక్షాధికారులు.

ధ్రువుని కుమారుడు : కాలుడు.

ధర్ముని కుమారులు : ద్రవిణుడు, హవ్యవాహనుడు, కల్పాంతస్థుడు, ప్రాణుడు, రమణుడు, శిశిరుడు, మనోహరుడు, ధవుడు, శివుడు. శివుడి కుమారుడు మనోజవుడు.

అనిలుడి కుమారులు : విశాఖుడు, శాఖుడు.

ప్రత్యూషుని కుమారులు : ముని, దేవలుడు.

ప్రభాసుడి కుమారుడు : విశ్వకర్మ. ఈయన దేవశిల్పి. దేవాలయములు, రాజభవనములు, ఉద్యానవనములు, ప్రతిమలు, నగలు, తటాకములు(చెరువులు), ఆరామములు (తోటలు, దొడ్లు), నూతులు.


ఏకాదశరుద్రులు :

ఏకాదశరుద్రులు : అజైకపాదు, హిర్భుధున్యుడు, విరూపాక్షుడు, రైవతుడు, హరుడు, బహుర్ధురూపుడు, త్రయంబకుడు, సురేశ్వరుడు, సావిత్రుడు(వైవసత్వుడు), జయంతుడు, పినాల, అపరాజితుడు. వీరిని గణేశ్వరులు అని కూడా అంటారు. 

త్రిశూలధరులు బ్రహ్మమానస పుత్రులు అయిన వీరికి ఎనుబది నాలుగు కుమారులు కలిగి సర్వదిశలలో వ్యాపించి జగద్రక్షణ చేస్తున్నరు. వీరి పుత్ర పౌత్రులు సురభినందు జన్మించారు.

Post a Comment

0 Comments