GET MORE DETAILS

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారంపై కేంద్ర హోం శాఖ సమావేశం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారంపై కేంద్ర హోం శాఖ సమావేశం



తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారంపై జనవరి 12న కేంద్రం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆహ్వానం పంపింది.

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని అంశాలపై చర్చించేందుకు రావాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఇరు రాష్ట్రాల సీఎస్‌లను కోరారు. ఢిల్లీలో నార్త్‌ బ్లాక్‌లోని కేంద్ర హోం శాఖ కార్యాలయంలో జనవరి 12న ఉదయం 11 గంటలకు భేటీ జరుగనున్నది. విభజన తర్వాత డిస్కంలకు బకాయిలు, ఫైనాన్స్​కార్పొరేషన్, తొమ్మిది, పదో షెడ్యూల్‌లోని సంస్థల విభజన, తదితర సమస్యలపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Post a Comment

0 Comments