GET MORE DETAILS

పెరిగిన నిరుద్యోగం - దేశంలో 7.91 శాతం : పట్టణాల్లో 9.30 శాతం - గ్రామాల్లో 7.28 శాతం

 పెరిగిన నిరుద్యోగం - దేశంలో 7.91 శాతం : పట్టణాల్లో 9.30 శాతం - గ్రామాల్లో 7.28 శాతం



దేశంలో నిరుద్యోగ రేటు భారీగా పెరిగింది. 2021 సెప్టెంబర్‌ నుంచి ప్రతి నెలా నిరుద్యోగ రేటు పెరుగుతోంది. అందులో పట్టణ నిరుద్యోగం మరింతగా పెరిగింది. 2021 డిసెంబర్‌లో దేశంలో 7.91 శాతం నిరుద్యోగం రేటు నమోదు కాగా, అందులో పట్టణ నిరుద్యోగ రేటు 9.30 శాతం, గ్రామీణ నిరుద్యోగ రేటు 7.28 శాతం ఉనుట్లు సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సిఎంఐఇ) వెల్లడించింది. 2021 సెప్టెంబర్‌లో దేశంలో 6.86 శాతం నిరుద్యోగం రేటు నమోదు కాగా, అందులో పట్టణ నిరుద్యోగ రేటు 8.62 శాతం, గ్రామీణ నిరుద్యోగ రేటు 6.06 శాతం నమోదైంది. 2021 అక్టోబర్‌ నాటికి దేశంలో నిరుద్యోగం రేటు 7.75 శాతానికి పెరిగింది. అందులో పట్టణ నిరుద్యోగ రేటు 7.38 శాతం, గ్రామీణ నిరుద్యోగ రేటు 7.91 శాతానికి పెరిగింది. 2021 నవంబర్‌లో దేశంలో 7 శాతం నిరుద్యోగం రేటు నమోదు కాగా, అందులో పట్టణ నిరుద్యోగ రేటు 8.21 శాతం, గ్రామీణ నిరుద్యోగ రేటు 6.44 శాతం నమోదైంది. డిసెంబర్‌లో 7.91 శాతం నిరుద్యోగ రేటు నమోదు కాగా, అందులో 9.30 శాతం పట్టణ, 7.28 శాతం గ్రామీణ నిరుద్యోగ రేటు నమోదైంది. ఇలా ప్రతి నెలా నిరుద్యోగ రేటు పెరుగుతూనే ఉంది.

నిరుద్యోగంలో హర్యానా టాప్‌ :

బిజెపి పాలిత హర్యానా 34 శాతంతో నిరుద్యోగంలో అగ్రభాగాన నిలిచింది. జాతీయ సగటుకు నాలుగైదు రెట్లు ఎక్కువ నిరుద్యోగ రేటు నమోదైంది. జాతీయ సగటు కంటే ఎక్కువ నిరుద్యోగ రేటు నమోదైన రాష్ట్రాల్లో రాజస్థాన్‌ (27.1 శాతం), జార్ఖండ్‌ (17.3 శాతం), బీహార్‌ (16 శాతం), జమ్ముకాశ్మీర్‌ (15 శాతం), గోవా (12 శాతం), త్రిపుర (14.7 శాతం), ఢిల్లీ (9.8 శాతం), హిమాచల్‌ప్రదేశ్‌ (9.4 శాతం) ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే తక్కువ :

తెలుగు రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే తక్కువ నిరుద్యోగ రేటు నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లో 5.6 శాతం నిరుద్యోగ రేటు నమోదు కాగా, తెలంగాణలో 2.2 శాతం నిరుద్యోగ రేటు నమోదైంది. ఏపిలో నవంబర్‌ (6.3 శాతం) కంటే డిసెంబర్‌ (5.6 శాతం)లో నిరుద్యోగ రేటు తక్కువ నమోదైంది. తెలంగాణలో నవంబర్‌ (4.4 శాతం) కంటే డిసెంబర్‌ (2.2 శాతం)లో నిరుద్యోగ రేటు తక్కువ నమోదైంది.

Post a Comment

0 Comments