GET MORE DETAILS

తిథి అంటే ఏమిటి ? అధిష్టాన దేవతలెవరు ?

 తిథి అంటే ఏమిటి ? అధిష్టాన దేవతలెవరు ?

                 


తిథి అంటే వేద సమయగణితము ప్రకారము చంద్రమాసములో ఒక రోజును తిథి అంటారు.

 ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి. సూర్యుడు నుండి చంద్రుని కదలికలు తిధులవుతాయి . ఉదాహరణకు సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటే అమావాస్య . అదే సూర్యచంద్రులు ఒకరికొకరు సమానదూరములో వుంటే పౌర్ణమి అవుతుంది.

 శాస్త్రీయముగా సూర్యుడు, చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు.

తిథులు సూర్యోదయమున ప్రారంభము కావు సూర్యాస్తమయానికి ముగియవు. రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉంది.

 ఒక్కొక్క తిథి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది. చాంద్రమాసంలో మొదటి తిథి పాడ్యమి. 

 1. పాడ్యానికి >  అధిదేవత అగ్ని.

 2 .విధియ > బ్రహ్మ

 3. తదియ > గౌరి

 4. చవితి > వినాయకుడు

 5.  పంచమి > నాగరాజు

 6. షష్టి > షణ్ముఖుడు

 7. సప్తమి > సూర్యుడు

 8.  అష్టమి > రుద్రుడు

 9.  నవమి > దుర్గ

10.  దశమి > ఆదిశేషుడు

11. ఏకాదశి > యమధర్మరాజు

12. ద్వాదశి > విష్ణు

13. త్రయోదసి > కాముడు లేదా శివుడు

14. చతుర్థశి >  కాళికామాత

15.  పౌర్ణమి > చంద్రుడు

16. అమావాస్య  > లక్ష్మీ

 ఏదైనా కార్యం తలపెట్టినపుడు ఆ తిథికి సంబంధించిన అధిష్టానదేవుడిని పూజించాలి. పూజకు వీలుకాకపోతే మనసులో స్మరించాలి.

Post a Comment

0 Comments