Ads Area

దూర్వాస మహర్షి

0

 దూర్వాస మహర్షి



దూర్వాసుడు, హిందూ పురాణాలలో అత్రి మహర్షి, అనసూయ ల పుత్రుడు. ఇతడు చాలా ముక్కోపి. అలా కోపం తెప్పించినవారిని శపిస్తాడు. అందువల్లనే ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆయన్ను విపరీతమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆయన కోపానికి గురైన వారిలో అభిజ్ఞాన శాకుంతలంలో వచ్చే శకుంతల ఒకరు.

మహాభారతంలో...

మహాభారతంలో దుర్వాసుడు ఆయనను తమ భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి, అతిథిగా ఆదరించిన వారికి వరాలు అనుగ్రహిస్తుంటాడు. వాటిలో ముఖ్యమైన ఘట్టం కుంతీదేవి బాల్యంలో జరిగింది. కుంతీ చిన్నతనంలో తన పెంపుడు తండ్రియైన కుంతీభోజుడి దగ్గర పెరుగుతుంటుంది. ఒకసారి దుర్వాసుడు ఆయన దగ్గరకు అతిథిగా వస్తాడు. ఆయన దుర్వాసునికి మర్యాదలు చేయవలసిన బాధ్యత కుంతీ దేవికి అప్పజెపుతాడు. ఆమె దుర్వాసుడు ఎలాంటి కష్టాలు పెట్టినా ఓర్చుకుని బాగా సేవలు చేస్తుంది. దుర్వాసుడు అందుకు సంతుష్టుడవుతాడు. ఆయన తిరిగి వెళ్ళేటపుడు ఆమెకు అథర్వణ వేదం లోని దేవతా ఉపాసనా మంత్రాలను కొన్నింటిని ఉపదేశిస్తాడు. ఆ మంత్రాల సాయంతో ఆమె కోరుకున్న దేవతలను ప్రార్థించే వరం సంపాదిస్తుంది. దీని సాయంతోనే ఆమె ముగ్గురు పాండవులను సంతానంగా పొందుతుంది. పెళ్ళి కాక మునుపే సూర్యుణ్ణి ప్రార్థించి కర్ణుని సంతానంగా పొందుతుంది. కానీ అవివాహిత కావడంతో ఏమి చేయాలో పాలుపోక ఆ బిడ్డను నదిలో వదిలి వేస్తుంది.

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area