GET MORE DETAILS

భారత విద్యార్థులు తిరిగి రావొచ్చు : చైనా

 భారత విద్యార్థులు తిరిగి రావొచ్చు : చైనా



కొవిడ్‌ వల్ల చైనా నుంచి స్వదేశానికి వెళ్లి రెండేళ్లుగా అక్కడే ఉండిపోయిన భారతీయ విద్యార్థులు తిరిగి తమ దేశంలో విద్యాభ్యాసం కొనసాగించేందుకు వీలైనంత త్వరగా వచ్చేందుకు కృషి చేస్తామని భారత్‌కు చైనా హామీ ఇచ్చింది. ఆ విద్యార్థులపై వివక్ష చూపబోమని చైనాలోని బీజింగ్‌లో భారతీయ దౌత్య కార్యాలయానికి చైనా విదేశీ మంత్రిత్వశాఖ(ఎంఎ్‌ఫఏ) హామీ ఇచ్చింది. ‘‘భారతీయ విద్యార్థులతో పాటు ఇతర విదేశీ విద్యార్థుల చదువు, సంక్షే మం గురించి మేం (చైనా) ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం’’ అని చైనా ఎంఎ్‌ఫఏ పేర్కొంది. ఈ విషయాన్ని భారతీయ దౌత్య కార్యాలయం కూడా ధ్రువీకరించింది. చైనాలో భారతీయ విద్యార్థులు తమ చదువును పునఃప్రారంభించడానికి ఏర్పా ట్లు చేయాలని చైనా అధికారులకు భారతీయ దౌత్య అధికారులు రెండేళ్లుగా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో చైనా తాజాగా ఈ ప్రకటన విడుదల చేసింది.

Post a Comment

0 Comments