GET MORE DETAILS

దశావతారములు

 దశావతారములు
1. మత్స్యావతారము :

సోమకాసురుడు అను రాక్షసుడు చతుర్వేదములను అపహరించి సముద్రమున దాక్కోనేను.  అప్పుడు  విష్ణు మూర్తి మత్స్యావతారమున అవతరించి  ఆ రక్కసుడుని సంహరించి వేదములను రక్షించెను.

2. కూర్మావతారము :

దేవతలును ,రాక్షసులు కలసి మంధర పర్వతాన్ని కవ్వముగా ,వాసుకిని తాడుగా చేసి సముద్రమును మదించు సమయములో మంధర పర్వతము  కూలెను . అప్పుడు  దేవతలు విష్ణు మూర్తిని ప్రార్దించగా విష్ణు మూర్తి కూర్మ అవతారమెత్తి మంధర పర్వతము యొక్క  చేరి అది  కూలకుండా చేసెను.

3. వరాహావతారము :

హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని చుట్టచుట్టి సముద్రమున ముంచెను . అందరి ప్రార్ధనలు మన్నించి విష్ణుమూర్తి వరాహరూపుడై హిరణ్యాక్షుడిని చంపి భూమిని రక్షించెను.

4. నృసింహావతారము :

హిరణ్యకశిపుడు బ్రహ్మ ను గూర్చి తపస్సు చేసి నరుల చేత కాని,మృగముల చేతకాని ,దేవతల చేత కాని,పగలు కాని,రాత్రి కాని,భూమి మీద కాని, ఆకాశంలో  కాని ,ఇంట కాని,బయట కాని,మరణం లేకుండా వరమును పొందాడు . పిమ్మట అతడు దేవతలను ముల్లోకములను మిక్కిలి భాద పెట్టెను . విష్ణు భక్తుడైన తన పుత్రుని కూడా భాదలు పెట్టుచుండెను . విష్ణువు సర్వాన్తరయామి అని అన్న తన కుమారుడి మాటలకు ఎదురుగా వున్నా స్తంబములో చూపించమని దానిని తన్నెను . హిరణ్యకశిపుడు ని సంహరించుటకై ఆ స్తంభము నుండి వచ్చెను . బ్రహ్మ ఇచ్చిన వరము భాగము కాకుండా సగము నర రూపములో సగము మృగ రూపములో వచ్చి దనుజుడిని ఇంటి గడప మీద కుర్చుని గోళ్ళతో చీల్చి సంహరించెను.

5. వామనావతారము :

 బలి చక్రవర్తి ముల్లోకములను ఆక్రమించి పాలించుచుండెను . దేవతల ప్రభావము తగ్గిపోయెను . ఇంద్రుడు తన రాజ్యమును పూగోట్టుకోనేను . దేవతలు మోర పెట్టుకొనగా విష్ణు మూర్తి వామనావతారమును ఎత్తి బాలి చక్రవర్తి కడకు వచ్చెను. బ్ర్రాహ్మన బ్రహ్మచారి అయిన వామనుదుని చుసిన బలి చక్రవర్తి ఎం కావాలో కోరుకో అని అడిగాడు . వామనుడు మూడు అడుగుల నేలను కోరగా రాక్షస గురువు శుక్రాచార్యుడు దానం ఇవ్వద్దని అడ్డుకుంటాడు . బాలి  తో కీతకమై కమండలములో దానం ఇవ్వకుండా అడ్డుపడగా కమండలం నుండి నీరు రాకపోవడంతో  వామనుడు దర్భతో కమండలమును పొడవగా శుక్రుడి కన్ను పోయెను . దానితో శుక్రుడు కమండలం నుండి బయటకు వచ్చేయగా నీరు వచ్చినది . బాలి మూడు అడుగుల నేలను దానం చేసాడు . వామనుడు విశ్వమంతా వ్యాపించి ఒక పాదముతో భుమినంతటిని కప్పెను రెండోవ పాదముతో ఆకాశమును కప్పెను . మూడోవ పాదమునకు చోటు లేకపోయెను తన వచనము తప్పకుండా మూడవ పాదము తన శిరస్సుపై పెట్టమని బాలి శిరస్సు వంచెను . వామనుడు బలిని పాతాళమునకు అనగదొక్కెను.

6. పరశురామావతారము : 

ఈయన రేణుక ,జమదగ్నిల పుత్రుడు . రాక్షసులు దేవతల మీదకు దాడి చేసి వారి నగరమును ద్వంసం చేస్తుండగా దేవతలు శివుడి దగ్గరకు వెళ్లి రక్షించమని ప్రార్దించగా శివుడు పరసురాముడిని పిలిపించి పరశువును ఇచ్చి దానవులను చంపమని చెప్పెను. ఆకారణముగా తన తండ్రిని చంపిన హయహయుడు అను రాజు మీద కోపముతో    యావత్ ప్రపంచములోని రాజులందరి మీదకు 21 సార్లు దండయాత్ర చేసి రాజులందరిని చంపివేసెను.

7. రామావతారము :

ఇప్పటికి మనందరమూ  రామరాజ్యము ,అని రాముడు లాంటి భర్త అని ,రాముడిని  ఉంటాము . అయోధ్యా  నగరాధీసుదు అయిన దశరడుడికి పుత్ర కామేష్టి యాగ ఫలముగా జన్మిస్తాడు . తండ్రి మాట కోసము రాజ్యాన్ని సైతం వదిలి అరణ్యవాసానికి వెళ్ళిన సర్వోత్తముడు రాముడు .  అరణ్య వాస సమయములోను ,సీతాన్వేషణ సమయములోను అనేక మంది రాక్షసులను చంపి లోకములో శాంతిని నిలిపెను . ఎన్ని యుగాలు మారినా ఇప్పటికి ఎందరికో ఆదర్శమూర్తి సీతాపతి.

8. బలరామ :

రోహిణి వసుదేవుల పుత్రుడు . అనేకమంది రాక్షసులను చమ్పదములొ శ్రీకృష్ణుడికి తన సహాయ సహకారములను అందించెను . ఇతను గదా విద్యా నిపుణుడు . బలమైన దేహము కలవాడు.

9. కృష్ణ :

దేవకీ వసుదేవుల పుత్రుడు దేవకీ దేవి అష్టమ గర్భం లో జనించెను . కంసుడిని చంపి తల్లి తండ్రుల చేర  విడిపించెను . ఎందరో రాక్షసులను సంహరించెను . భక్తి తో పిలిచిన భక్తుల మొరలు వినే దయాముర్తి కృష్ణ పరమాత్ముడు . ద్రౌపది ని నిండు సభలో వస్త్రాపహరణం చేయాలని చూసినా ,అక్కడ వున్నా వారంతా బొమ్మల్లా చూస్తూ నిలబడిని ఆవిడ మోర విని ఆవిడను కాపాడిన కరునాన్థరంగుడు . ఆ ఒక్క సారే కాదు ఎన్నో సార్లు ఆవిడను రక్షించాడు . కురుక్షేత్ర సమయములో అర్జునికి గీతోపదేశము చేసాడు . ఇప్పటికి భాగావత్గీతను దైవ సమానముగా పూజిస్తారు . పారాయణ చేస్తున్నాము . ఇంట్లో భగవత్ గీత వుంటే సకల కార్యాలు దిగ్వుజయముగా నెరవేరుతాయి ఎటువంటి ఆపదలు రావు. 

10. కల్కి :

విష్ణు మూర్తి కలియుగాన్థమున కల్క్యత్మకుడై విష్ణు యశుడను పేరున పుట్టును . అతడు సకల ధర్మములను నిలుపును . అధర్మములను మ్లేచ్చులను సంహరించును.


సర్వేజన సుఖినో భవంతుPost a Comment

0 Comments