Ads Area

అన్న ఉద్యోగంలో 24 ఏళ్లుగా తమ్ముడు...! అన్న చనిపోయిన విషయం దాచి టీచరుగా చేరిన తమ్ముడు

0

అన్న ఉద్యోగంలో 24 ఏళ్లుగా తమ్ముడు...! అన్న చనిపోయిన విషయం దాచి టీచరుగా చేరిన తమ్ముడు



ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చిన అన్న విధుల్లో చేరకుండానే మృతి చెందారు. అతడి నియామకపు ఉత్తర్వుల ఆధారంగా తమ్ముడు ఉద్యోగంలో చేరాడు. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా అతను ఏకంగా 24 ఏళ్లపాటు టీచరుగా విధులు నిర్వర్తించాడు. కర్ణాటకలో ఈ వ్యవహారం వెలుగుచూసింది. రెండేళ్ల కిందట హుణసూరుకు చెందిన ఓ పాత్రికేయుడికి ఈ విషయం తెలియగానే వివరాలు సేకరించారు. మైసూరు జిల్లా కేఆర్‌ నగర్‌ తాలూకా హెబ్బాళు గ్రామానికి చెందిన లోకేశ్‌గౌడ 1994-95లో స్కూల్‌ అసిస్టెంట్‌గా ఎంపికయ్యారు.

విధుల్లో చేరేలోగా అకాల మరణం చెందారు. ఇదే అదనుగా నియామకపు పత్రంతో తానే లోకేశ్‌గౌడ అని అతడి తమ్ముడు లక్ష్మణగౌడ పెరియపట్టణ పరిధిలోని ముద్దనహళ్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా  చేరాడు. ప్రస్తుతం కట్టిమళలపాడిలో పనిచేస్తున్నాడు. లోకాయుక్త నుంచి వచ్చిన ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరపగా, వీరి వంశవృక్షంలో లక్ష్మణగౌడ అనే పేరే లేకుండా చేసినట్లు గుర్తించారు. విద్యాశాఖాధికారులు ఫిర్యాదు చేయగా పెరియపట్టణ పోలీసులు ఈనెల 21న లక్ష్మణగౌడను అరెస్టు చేశారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area