GET MORE DETAILS

నిజ జీవిత సత్యాలు

నిజ జీవిత సత్యాలు



■ సుఖపడటం మోజులో పడి భవిష్యత్తు పాడుచేసుకోవడం తప్పు.

■ భక్తిలేక  పోవడం తప్పు కాదు, ఇతరుల మనోబావాలు దెబ్బతీయడం తప్పు.

■ బతకడం కోసం తినాలి ,తిండి కోసం బతకకూడదు.

■ జన్మ నిచ్చిన తల్లిదండ్రులను నిర్లక్యం చేయడం తప్పు, నమ్మివచ్చిన భార్యను వదలడం తప్పు.

■ ఇతరులు మెప్పు కోసం నీకోసం కష్టపడే వారిని, నిన్ను అభిమానించే వారిని బాధపెట్టడం తప్పు.

■ సంతోషాలకు ,అయిన వాళ్లకు దూరం చేసే సంపాదన వృధా.

■ అన్నిటికన్నా దారుణం నమ్ముకొన్న వారికి ద్రోహం చేయుట , దీనికి పరిహారం లేదు.

■ స్నేహం చేయడం గొప్పనా, సహాయం చేయడం గొప్పనా అంటే సహాయం చేయడమే గొప్ప.

■ ఎన్ని ఏండ్లు స్నేహం చేసినా గుణం తెలుసుకోలేము. గుడ్డి ప్రేమతో ఉంటారు, డబ్బు ఇచ్చి తిరిగి తీసుకునే టప్పుడే మనిషి గుణం తెలుస్తుంది.

■ బలహీనులు పైన బలం చూపించకూడదు , మనది కానీ చోట అధికారం చూపకూడదు.

■ అన్నిటా అధికులైనవారిని చూసి అసూయపడటం కన్నా లేనివారికి సహాయపడి గొప్పవారు కావడం మిన్న.

■ ఆకలికి చేసిన దొంగతనం, ప్రపాయంలో చెప్పే అబద్దం, ఒక బంధాన్ని నిలపడం కోసం చేసే మోసం తప్పు కాదు..

■ చదువుకు తగ్గ సంస్కారం లేకపోవడం దండగ.

■ ఆశపడటం తప్పు కాదు.అత్యాశ పడటం తప్పు.

■ అహంకారి ఇంట్లో పరమాన్నంకన్నా, ఆప్యాయత గల ఇంట్లో గంజినీళ్లు మిన్న.

■ ఉపయోగించడానికి పనికిరాని బురదనీరు మంటలు ఆర్పడానికి పనికి వస్తుంది కనుక ఉపయోగపడని వ్యక్తి ఉండరు.

■ సీత వంటి భార్య, లక్ష్మణుడు వంటి తమ్ముడు ఉంటే వనాలు కూడా రాజ భావనాలే.

■ భక్తిని రోడ్డు పైకి తెచ్చేస్తున్నారు ప్రచారం చేస్తున్నారు అంటే, పాలను ఇంటింటికి వచ్చి ఇస్తారు ,సారాయి వెతుక్కుని వెళ్తారు, భక్తుని పెంచడం కోసం తప్పు లేదు, కానీ భక్తితో వ్యాపారం చేయడం తప్పు.

■ మన్నించమని అడగటం తక్కువ కాదు, అది బంధం నిలుపు కోవడం.

■ మౌనంగా ఉండటం అంటే తప్పు ఒప్పుకున్నట్టు కాదు. బురదలో రాళ్లు వేయడం ఇష్టం లేదని అర్థం.

■ మంచి వాళ్ళు అజ్ఞాతం లో ఉంటే చెడు రాజ్యం ఏలుతుంది.

■ కంటికి దగ్గరగా దైవం ఉన్నా కనిపించదు, దూరపు కొండలు నునుపు.

■ ఎంత సంపాదన ఉన్నా ఆరోగ్యం లేని వాడు పేద వాడే.

■ అప్పు లేని వాడు ఎక్కడైనా మహారాజే.

■ రాలిన ఆకులు చూసి కృంగి పోకూడదు, రాబోయే చిగురులు కోసం ఎదురు చూడాలి.

■ మనిషి భయాన్ని ఎప్పుడు జయించగలడు, మృత్యువును సత్యం అని అంగీకరించినప్పుడు.

■ మనిషి ఊపిరి రక్తంలో ఉంటుంది, భగవంతుడు మనిషి ఆకలిలో ఉంటాడు. రక్త దానం చేస్తే ప్రాణ దానం చేసి నట్టు , అన్న దానం చేస్తే దైవాన్ని తృప్తి పరచినట్టు.


శ్రీ మాత్రే నమః

Post a Comment

0 Comments