GET MORE DETAILS

కొన్ని పదార్థాలకు వాసన ఎలా అబ్బుతుంది ?

కొన్ని పదార్థాలకు వాసన ఎలా అబ్బుతుంది ?



పదార్థాలు వివిధ భౌతిక, రసాయనిక స్థితుల్లో ఉంటాయి. ఘన, ద్రవ, వాయు స్థితులతో పాటు, రసాయనికంగా రకరకాల అణునిర్మాణాలతో ఉంటాయి. వాసన వచ్చే పదార్థాలకు ఆవిరయ్యే లక్షణం ఉంటుంది. అవి ఘన రూపంలో ఉన్నా, ద్రవ రూపంలో ఉన్నా ఎంతోకొంత మేరకు సాధారణ ఉష్ణోగ్రతల వద్దే ఆవిరవుతూ ఉంటాయి. ఆ ఆవిరిలో వాటి అణువులు ఉంటాయి. ఇవి మన నాసికా రంధ్రాలను చేరినప్పుడు మన ముక్కులోపలి తడిపొరల మీద ఉన్న ఘ్రాణ నాడులు ప్రేరేపితమవుతాయి. అందుకనే వీటిని రసాయనిక గ్రాహకాలు అని కూడా అంటారు. ఇలా వివిధ పదార్థాల ఆవిరులలో వేర్వేరు అణువులు ఉండడం వల్ల ముక్కులోని నాడుల మీద వీటి ప్రభావం వాటి విలక్షణతతో ఉంటుంది. వీటి వల్ల ప్రేరేపితమయ్యే నాడులు ఆయా విశిష్ట సంకేతాలను మెదడుకు చేరవేస్తాయి. వాటిని బట్టి మనం వేర్వేరు వాసనలను గుర్తించగలుగుతాం.

Post a Comment

0 Comments