GET MORE DETAILS

శివుడే విష్ణువు విష్ణువే శివుడు...!!

శివుడే విష్ణువు విష్ణువే శివుడు...!!



■ దేవుడు మనిషిని సృష్ఠించి పంచభూతాలతో ప్రకృతిని సృజించి అద్భుతమైన జీవనసౌఖ్యాన్ని అనుభవాన్ని పొందమన్నాడు.

● అయితే హిందూ మతధర్మం, ఆర్ష విజ్ఞానం భోదించేది ఒకటే. దైవం ఒక్కడే భారత వర్షంలో మతవిధానము ఒక్కటే అని ఉద్భోదించినా, మనుషులు తమ స్వార్ధానికి నిర్మించుకున్న పాపకూపాలే వివిధ మతాలు అది శైవమైనా వైష్ణవమైనా అంతే దైవానికి విభజన లేదు.

■ శివ సహస్ర నామస్తోత్రం పంచమవేదంగా ప్రసిద్ధి చెందింది.

● మహాభారత యుద్ధానంతరం ధర్మరాజుని శ్రీకృష్ణుడు భీష్మాచార్యు ని వద్దకు తీసుకుని వెళ్ళగా, కురువంశ పితామహుడు సకల ధర్మాలను, ధర్మ సూక్ష్మా లనూ ధర్మరాజుకు భోదించాడు.

● అంతా నేర్చుకున్న తరువాత ధర్మరాజు తన మనసులోని మాటను బయట పెట్టాడు. పంచమ వేదంగా పరిగణిస్తున్న శివ సహస్ర నామ స్తోత్రం గురించి చెప్పమని తాతగారిని కోరతాడు.

● అప్పుడు బీష్మాచార్యుడు ఏ మాత్రం భేషజం లేకుండా ఇలా అంటాడు." ధర్మజా! శివుని గురించి సమగ్రంగా చెప్పగలిగినవాడు శ్రీకృష్ణుడు ఒక్కడే. వారిద్దరూ ఒకటే కనుక ,శ్రీకృష్ణుడు మాత్రమే శివ సహస్ర నామ స్తోత్రాన్ని గురించి చెప్పగలడు." అని అంటాడు.

● అదే సందర్భంలో భీష్మాచార్యుడు శ్రీకృష్ణుడి వైపు చూస్తూ ధర్మరాజు మనోభిష్టాన్ని గ్రహించావు కదా! శివ సహస్ర నామ స్తోత్రం గురించి వివరించు ' అని అంటాడు.

● దాంతో శ్రీకృష్ణుడు కాసేపు ఆలోచన చేసి శివుని వెయ్యి నామాలను ధారాళంగా చెబుతాడు.అంత వేగంగా , తడుముకోకుండా చెప్పగలిగిన వాడు శ్రీకృష్ణుడు మాత్రమేనన్న తన మాట నిజమైనందుకు భీష్మాచార్యుడు సంతోషిస్తాడు. 

● అప్పుడు ధర్మరాజుతో ఇలా అంటాడు." ధర్మజా ! తెలియని వారు ,సగం తెలిసినవారు శివ, కేశవులకు మధ్య భేదాన్ని సృష్టిస్తు ఉంటారు. సృష్టి స్థితి లయ కారకులైన త్రిమూర్తులు ముగ్గురూ ఒకటే ,వారిని వేరు చేసి చూడటం తగదు.

● ఈ విషయాన్ని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు కూడా స్పష్టం చేసాడు. ఈశ్వరుని అంశతో జన్మించిన ఆంజనేయుణ్ణి తనకు నమ్మకమైన మిత్రునిగా, సచివునిగా శ్రీరామచంద్రుడు పరిగణించడానికి ప్రధాన కారణం ఇదే.

● శివ కేశవుల మధ్య ఎటువంటి భేదం లేదని చెప్పడనికి ఆంజనేయుడే ఉదాహరణ. శివుడు ఆపదలో ఉన్నప్పుడు విష్ణుమూర్తి తోడ్పడినట్లే ,విష్ణుమూర్తికి శివుడు తోడ్పడాడు. ఈశ్వరాంశ సంభూతు డైన ఆంజనేయుడు సీతాన్వేషణలో శ్రీరామచంద్రునికి తోడ్పడటాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.

■ "శివాయ, విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే " అని సంద్యావందనం శ్లోకాలు తెలుపుతున్నాయి.

● శివ, కేశవుల్లో ఎవరిని అరాధించినా ఒకటే.ఇద్దరినీ అరాధించినా తప్పు లేదు. సృష్టిలోని ప్రాణులనునిలబెడు తున్నది విష్ణుమూర్తి అయితే లయం చేసుకుంటున్నది పరమేశ్వరుడు.ఇద్దరికీ ప్రీతిపాత్రమైనది కార్తీకమాసం. కార్తీక మాసంలో శివునికి అభిషేకాలు చేసినట్లే విష్ణుమూర్తికి ప్రీత్యర్ధం సాలగ్రామ పూజలు చేయడం ఆన వాయితీ ,

● అలాగే కార్తీక మాసం వెళ్ళిన వెంటనే వచ్చే మార్గశిర మాసంలో కూడా శివ కేశవుల అరాధన జరుగు తుంది.

రూపాలు వేరైనా దైవం ఒకటే అన్నది మన పెద్దల మాట...స్వస్తి..

 ఓం నమో నారాయణాయ

Post a Comment

0 Comments