GET MORE DETAILS

ఏ నక్షత్రంలో శ్రీనివాసుని దర్శిస్తే, ఏ ఏ ఫలితాలు లభిస్తాయి...

 ఏ నక్షత్రంలో శ్రీనివాసుని దర్శిస్తే, ఏ ఏ ఫలితాలు లభిస్తాయి...




ఆ స్వామిని  దర్శించడానికి ప్రత్యేక సమయమంటూ ఏదీ లేదు...కానీ ఒక్కొక్క  నక్ష్మత్రంనాడు దర్శిస్తే  ఒక్కొక్క ప్రత్యేక ఫలితం ఉంటుంది.  అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం...

1. అశ్వనీ నక్షత్రంనాడు శ్రీనివాసుని  దర్శిస్తే ఎటువంటి అనారోగ్యమైనా నశిస్తుంది, 

2. భరణీ నక్షత్రంనాడు ఆనందనిలయం లోని స్వామిని దర్శించిన వారికి అపమృత్యుభయం  తొలగిపోతుంది. 

3. కృత్తికా నక్షత్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని జన్మనక్షత్రం. ఆనాడు శ్రీనివాసుని దర్శించినవారికి చక్కటి చదువు లభిస్తుంది. జీవితంలో  ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. 

4. రోహిణీ నక్షత్రంనాడు స్వామిని దర్శిస్తే ..ఎటువంటి మానసిక సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి. 

5. మృగశిర స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైనది.  మాసాలలో మార్గశిర మాసం తానేనంటాడు శ్రీమన్నారాయణుడు. పూర్వకాలంలో కొత్త సంవత్సరం  మార్గశిర నక్ష్మత్రంనాడే ప్రారంభమయ్యేది.  ఆ నక్షత్రం రోజున శ్రీనివాసుని  దర్శించినవారికి సర్వ శుభాలు కలుగుతాయి. 

6. ఆరుద్ర నక్షత్రానికి  అధిదేవత రుద్రుడు. ఈ నక్షత్రం రోజున స్వామిని దర్శించినవారికి ఎటువంటి  ఆపదలూ కలుగవు. 

7. రామచంద్రుని అవతార జన్మ నక్షత్రమైన  పునర్వసునాడు  ఆనంద నిలయంలోని స్వామిని దర్శిస్తే ఎటువంటి కస్టాలైనా  తొలగిపోతాయి.  ప్రత్యేకించి ఆర్థిక బాధలు ఉన్నవారు, మానసిక సమస్యలు ఉన్నవారు పునర్వసునాడు స్వామిని దర్శిస్తే చాలా శ్రేయస్కరం. కుటుంబంలోశాంతి సౌభాగ్యాలు వెల్లివెరుస్తాయి. 

8. పుష్యమీ నక్షత్రంనాడు స్వామిని దర్శిస్తే.. వెయ్యి జన్మల పాపం నశిస్తుంది. 

9. ఆశ్లేష నక్షత్రానికి అధిదేవత ఆదిశేషుడు. ఆ రోజు స్వామిని  దర్శించినవారికి ఎటువంటి భయాలైనా తొలగిపోతాయి. శారీరక మానసిక సమస్యలన్నీ ఇట్టే మాయమౌతాయి. మనస్సంతా ప్రశాంతత తో నిండి పోతుంది.

10. మఖానక్షత్రంనాడు శ్రీనివాసుని దర్శిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. 

11. జగన్మాత  నక్షత్రమైన పూర్వఫల్టుణి (పుబ్బ) నక్షత్రంనాడు శ్రీ స్వామివారిని దర్శిస్తే కన్యలకు  త్వరగా వివాహం జరుగుతుంది. వివాహం ఆలస్యం అవుతున్న యువకులకు కూడా వెంటనే పెళ్ళి నిశ్చయమౌతుంది. 

12. స్వామివారి ప్రియసఖి శ్రీమహాలక్ష్మీ నక్షత్రమైన ఉత్తరఫల్డుణి నాడు ఆనందనిలయంలో స్వామిని దర్శించినవారికి సర్వసౌభాగ్యాలు కలుగుతాయి. ఎంతో ఐశ్వర్యవంతులౌతారు.

13. హస్తా నక్షత్రంనాడు శ్రీనివాసుని దర్భ్శించినవారికి ఎటువంటి అనారోగ్యమైనా క్షణంలో  తొలగిపోతుంది.

14. చిత్తా నక్షత్రంనాడు స్వామివారిని దర్శిస్తే యశస్సు, సకల సంపదలు కలుగుతాయి. శరీరం నూతన తేజస్సుతో నిండిపోతుంది.  

15. స్వాతి నక్షత్రం నరసింహ స్వామివారి జన్మనక్షత్రం.స్వామి నరసింహునిగా అవతరించి హిరణ్య కశిపుని సంహరించాడు. స్వాతి నక్షత్రం నాడు శ్రీనివాసుని దర్శిస్తే అపమృత్యు భయం తొలగిపోతుంది. ఎటువంటి ప్రమాదాలు జరగవు. ఎటువంటి  ఆపదలు కలుగవు.

16. విశాఖ నక్షత్రంనాడు శ్రీనివాసుని దర్శించినవారికి త్వరలో వివాహమౌతుంది. కన్యలకు మంచి యువకులు,యువకులకు మంచి కన్యలు, జీవితభాగస్వాములుగా లఖిస్తారు.  విశాఖ నక్షత్రాన్ని  రాధా నక్షత్రం అని, వైశాఖమాసాన్ని రాధా మాసమని కూడా అంటారు. 

17. అనూరాధ  నక్షత్రంనాడు స్వామివారిని  దర్శించినవారికి సర్వసౌభాగ్యాలు కలుగుతాయి. ఎంతో కాలంనుండి తీరని అప్పులు కొద్దినెలల్లోనే తీరిపోతాయి. 

18. జ్యేష్టా నక్షత్రంనాడు స్వామివారిని దర్శించినవారికి ఉన్నత పదవులు లభిస్తాయి.  సర్వసంపదలూ  చేకూరుతాయి.

19. మూలా నక్షత్రం చదువుల తల్లి సరస్వతీ దేవి  జన్మ నక్షత్రం.ఈ రోజు స్వామివారిని దర్శించినవారికి సర్వవిద్యలూ లభిస్తాయి. విద్యార్థులు  పరీక్షలలో అద్భుత విజయం సాధిస్తారు.

20. పూర్వాషాఢ నక్ష్మత్రంనాడు శ్రీనివాసుని  దర్శిస్తే  ఎంతో సంపద కలుగుతుంది. 

21. ఉత్తరాషాఢ నాడు స్వామివారిని దర్శిస్తే  ఎటువంటి అనారోగ్యమైనా తొలగిపోతుంది. సర్వసౌభాగ్యాలూ కలుగుతాయి.మనస్సంతా ప్రశాంతత కలుగుతుంది.

22.  శ్రీమన్నారాయణులవారి జన్మ నక్షత్రమైన శ్రవణానక్షత్రం రోజున ఆనంద నిలయంలో స్వామివారిని దర్శించినవారు  జీవించినంత కాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందుతారు. దేనికీ  లోటు లేకుండా జీవితమంతా సాఫీగా జరిగిపోతుంది. 

23. ధనిష్టా నక్షత్రంనాడు  స్వామిని దర్శిస్తే... ఐశ్వర్యం లభిస్తుంది. ఎంతో కాలంగా రావలసిన సొమ్ము  వెంటనే చేతికి వస్తుంది. 

24. శతభిషంనాడు స్వామివారిని దర్శిస్తే కుటుంబంలో  శుభకార్యాలు జరుగుతాయి... సకాలంలో వర్షాలు కురిసి మంచి పంటలు పండుతాయి.

25. పూర్వాభాద్ర నక్షత్రంనాడు స్వామిని  దర్శిస్తే ఎన్నో రోజులుగా ఆగిపోయిన పనులు వెంటనే నెరవేరుతాయి.

26. ఉత్తరాభాద్రనాడు శ్రీనివాసుని దర్శిస్తే చక్కటి సంతానం కలుగుతుంది.

27. రేవతీ నక్షత్రంనాడు స్వామివారిని దర్శిస్తే సర్వశుభాలూ కలుగుతాయి. ఎటువంటి అనారోగ్యమైనా క్షణంలో తొలగిపోయి  సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ఆయా రోజుల్లో స్వామిని దర్శించి శుభాన్ని పొందుతాము.

Post a Comment

0 Comments