GET MORE DETAILS

పోలాండ్ లో ఈ భారత రాజును దూషిస్తే మరణశిక్షే , కానీ భారతీయులకి ఆయానెవరో కూడా తెలియకుండా చేసిన గొప్ప విద్యా విధానం...!

పోలాండ్ లో ఈ భారత రాజును దూషిస్తే మరణశిక్షే , కానీ భారతీయులకి ఆయానెవరో కూడా తెలియకుండా చేసిన గొప్ప విద్యా విధానం...!పోలాండ్ కు భారతదేశం అంత ఎందుకు అంత మమకారం ? ఏ రకంగా వారిని మనం కాపాడాము ? ఇజ్రాయిల్ లాగానే మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చే పోలాండ్ వాసుల ఒకప్పటి దయనీయమైన కధ ?

పోలాండ్‌పై హిట్లర్ రెండో ప్రపంచయుద్ధం ప్రారంభించినప్పుడు, ఆ సమయంలో పోలెండ్ సైనికులు తమ దేశానికి చెందిన 500 మంది మహిళలను, దాదాపు 200 మంది పిల్లలను సముద్రంలో ఓడలో వదిలి, ఏ దేశంలో ఆశ్రయం లభిస్తుందో అక్కడికి తీసుకెళ్లమని కెప్టెన్‌కి చెప్పారు.  ప్రాణం ఉంటే బతికితే, మళ్లీ కలుద్దాం! అని చెప్పారు,

 500 మంది శరణార్థులు పోలాండ్ మహిళలు, 200 మంది చిన్నారులతో నిండిన ఓడ ఇరాన్‌లోని ఓడరేవుకు చేరుకుంది, ఆ దేశస్తులు ఎవరికీ ఆశ్రయం ఇవ్వలేదు, 

మళ్లీ అలా వెళ్తూ వెళ్తూ  అదాన్‌లో ఆగారు, కానీ అక్కడ కూడా ఉండడానికి వారికి అనుమతి లభించలేదు.. చివరికి, సముద్రంలో తిరుగుతున్న ఒక ఓడ వచ్చింది.

అది గుజరాత్‌లోని జామ్‌నగర్‌ ఒడ్డున....!

అప్పటి జామ్‌నగర్ రాజు "జామ్ సాహబ్ దిగ్విజయ్ సింగ్" తన రాజభవనాన్ని 500 మంది స్త్రీలు మరియు 200 మంది పిల్లలకు బస చేయుటకు ఇవ్వడమే కాకుండా ఆ పిల్లలను తన రాష్ట్రంలోని బాలచాడిలోని సైనిక్ పాఠశాలలో చదివించే ఏర్పాటు చేశాడు.  ఈ శరణార్థులు తొమ్మిదేళ్లు జామ్‌నగర్‌లో నివసించారు.

అదే శరణార్థి పిల్లల్లో ఒకరు తరువాత పోలాండ్ ప్రధాని అయ్యారు. నేటికీ ప్రతి సంవత్సరం ఆ శరణార్థుల వారసులు జామ్‌నగర్‌కు వచ్చి తమ పూర్వీకులను స్మరించుకుంటున్నారు.

పోలాండ్ రాజధాని వార్సాలోని అనేక రహదారులకు మహారాజా జామ్ సాహబ్ పేరు పెట్టారు. పోలాండ్‌లో ఆయన పేరు మీద అనేక ప్రణాళికలు అమలు చేయబడ్డాయి.  ప్రతి సంవత్సరం పోలాండ్ వార్తాపత్రికలలో మహారాజా జామ్ సాహబ్ దిగ్విజయ్ సింగ్ గారి గురించి కథనం ప్రచురించబడుతుంది.  ప్రాచీన కాలం నుండి భారతదేశం ప్రపంచానికి వసుధైక కుటుంబం మరియు సహనం అనే పాఠాన్ని బోధిస్తోంది మరియు నేటి కొత్త నాయకులు, కుహనా జర్నలిస్టులు, మొదలైనవారు భారతదేశ సహనాన్ని ప్రశ్నిస్తున్నారా...?

రాజు జామ్ దిగ్విజయ్ సింగ్ జడేజా వచ్చిన వారి పరిస్థితిని చూసి వారికి ఆశ్రయం ఇచ్చాడు. ఆశ్రయం ఇవ్వడమే కాకుండా, వారి పిల్లలకు సైన్యానికి శిక్షణ ఇచ్చి, వారికి అన్ని విద్యలు నేర్పించారు, తరువాత ఆయుధాలు ఇచ్చి పోలాండ్‌కు పంపారు, అక్కడ వారు జామ్‌నగర్ లో తీసుకున్న సైన్యం శిక్షణతో దేశాన్ని పునరుద్ధరించారు.

నేటికీ పోలాండ్ ప్రజలు వారిని ఆహార ప్రదాతలుగా పరిగణిస్తున్నారు. వాళ్ళ రాజ్యాంగం ప్రకారం, *జామ్ దిగ్విజయ్ సింగ్* గారు వారికి దేవుడు లాంటివాడు.  అందుకే నేటికీ వారిని సాక్షులుగా పరిగణిస్తూ నేతలు పార్లమెంట్‌లో ప్రమాణం చేస్తారు.

భారతదేశంలో దిగ్విజయ్ సింగ్ గారిని అవమానిస్తే, ఇక్కడ లా అండ్ ఆర్డర్‌లో శిక్షించే నిబంధన లేదు.  కానీ అదే తప్పు పోలెండ్ లో చేస్తే  ఫిరంగికి కట్టేసి పేల్చేస్తారు.

ఈ పోలాండ్ ప్రజలు జామ్‌నగర్ మహారాజా దిగ్విజయ్ సింగ్ జడేజా పేరుతో ఎందుకు ప్రమాణం చేస్తున్నారో తెలుసా ?

ఉక్రెయిన్ నుండి వచ్చే భారత ప్రజలను వీసా లేకుండా తమ దేశంలోకి ప్రవేశించడానికి పోలాండ్ ఎందుకు అనుమతిస్తుందో తెలుసా?

జామ్ సాహిబ్ చేసిన ఆ పనిని పోలాండ్ నేటికీ మరచిపోలేదు.  కాబట్టి ఈ రోజు భారతదేశం వీసా లేకుండా వచ్చేవారిని అనుమతిస్తోంది.  వారికి అన్ని విధాలుగా సహాయం చేస్తున్నారు.

భారతదేశ చరిత్ర పుస్తకాలలో దిగ్విజయ్ సింగ్ గురించి ఎప్పుడైనా బోధించారా? 

పోలాండ్ పౌరుడు ఒక భారతీయుడిని, "మీకు జామ్‌నగర్ మహారాజా దిగ్విజయ్ సింగ్ గారు తెలుసా?" అని అడిగితే, ఉక్రెయిన్‌లో డాక్టర్ చదవడానికి వెళ్లిన భారతీయ విద్యార్థులు, తెల్ల మోహం వేశారు.

Post a Comment

0 Comments