GET MORE DETAILS

వడదెబ్బ లక్షణాలు తీసుకోవాల్సిన నివారణపద్దతులు

వడదెబ్బ లక్షణాలు తీసుకోవాల్సిన నివారణపద్దతులు
    


ఎండాకాలంలో వేడివల్ల చాలామందిలో మైకం, భయం, వికారం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటికి వెళ్లకూడదు.

ముఖ్యంగా పగటిపూట 12 గంటల నుంచి 3 గంటల వరకు ఇల్లు లేదా కార్యాలయంలో ఉంటే మంచిది. ఎందుకంటే ఈ సమయంలో సూర్య కిరణాల వేడి ఎక్కువగా ఉంటుంది. అలసిపోయి కిందపడిపోవడం, చంచలంగా అనిపించడం, మతిస్థిమితం కోల్పోవడం వంటి సమస్యలు ఉంటాయి. అయితే ఎండలో బయటకు వెళ్లవలసి వస్తే కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు వడదెబ్బ నుంచి మిమ్మల్ని మీరు పూర్తిగా సురక్షితంగా కాపాడుకోవచ్చు.

1. శరీరం ఎక్కువగా అలసిపోకుండా చూసుకోండి. 

2. ఇంటి నుంచి బయలుదేరే ముందు ఒక గ్లాసు నిమ్మరసం, చల్లని పాలు, మజ్జిగ లేదా లస్సీని తీసుకోండి.

3. తల, చెవులను కప్పుకున్న తర్వాత మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్లండి.

4. మీకు కావాలంటే గొడుగు ఉపయోగించండి. వాటర్ బాటిల్ మీ దగ్గర పెట్టుకోండి.

5. ఈ నీళ్లలో కాస్త బ్లాక్ సాల్ట్, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపితే మంచిది. 

6. ఏసీ నుంచి డైరెక్ట్‌గా ఎండలోకి వెళ్లవద్దు. అలాగే ఎండలో తిరిగివచ్చి డైరెక్ట్‌గా AC గదికి వెళ్లవద్దు. కొంచెం సమయం తీసుకున్న తర్వాత వెళ్లాలి. తద్వారా శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది.

వడదెబ్బ లక్షణాలు :

1. ఎండదెబ్బకి గురైనట్లయితే సరైన చికిత్స తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పరిస్థితి దిగజారకుండా ఉంటుంది.

2. కొంచెం మైకంతో పాటు తల తిరుగుతున్న అనుభూతి ఉంటుంది.

3. తలనొప్పి, మైకం ఉంటుంది.

4. ఏకాగ్రత ఉండదు.

5. బలహీనత, కండరాల నొప్పి

6. విపరీతమైన దాహం, కడుపులో తిప్పుతున్న అనుభూతి

7. వాంతులు, విరేచన

వడదెబ్బ తగ్గినా వైద్యం అవసరం...!

1. వడదెబ్బ లక్షణాలు కనిపించగానే ఆ వ్యక్తి చల్లని చోటికి చేర్చడంతోపాటు గంటకు ఒక గ్లాసు చొప్పు నీరు తాగించాలి. బాగా ఎండలో పనిచేసే వారైతే గంటకు రెండు గ్లాసుల నీరు తాగించాలి. ఆ వ్యక్తిఉన్న గదిని చల్లబరిచే ప్రయత్నం చేయాలి. 

2. శరీరాన్ని చల్లబరిచే ధర్మం ఉన్న పుచ్చకాయలు, కొబ్బరి నీరు, తాటి ముంజల వంటివి ఇవ్వాలి. 

3. వీటితో పాటు శరీరాన్ని చల్లబరిచే కొన్ని ఔషధాలు కూడా ఇవ్వాలి. బ్రాహ్మి, మండూకపర్ణి, అతి మధురం, శంకపుష్టి, బూడిద గుమ్మడికాయ, నన్నారివేళ్లు (సారివ) చందనం, వట్టివేరు వీటన్నింటినీ పొడి చేసి రెండు చెంచాల పొడిని నీళ్లల్లో కలపి తాగాలి. లేదా వాటిలో ఏదో ఒకదాని పొడి మాత్రమే అయితే ఒక చెంచా పొడిని నీళ్లల్లో కలిపి తాగాలి. అవసరమనుకుంటే రెండు చెంచాల పంచదార, రెండు చిటికెల ఉప్పు కూడా కలిపి తీసుకోవచ్చు.

మెదడునుచల్లబరిచేందుకు....

వడదెబ్బ చికిత్సలో శరీరాన్నే కాదు మెదడును చల్లగా ఉంచడం చాలా ముఖ్యం. ఇందుకు చందనం గంధం తీసి మెడకు ఇరువైపులా రాయాలి. నీళ్లల్లో ముంచి పిండిన తడి వస్త్రాన్ని మెడ, ఛాతీ పొట్ట భాగాలకు చుట్ట వచ్చు. అయితే అది కొంత పొడిబారగానే దాన్ని తీసివేసి వేరే వస్త్రం చుట్టాలి. అంతే తప్ప వేసిన వస్త్రాన్ని అలాగే ఉంచేయకూడదు.

వడదెబ్బకు గురైన వాళ్లల్లో చాలా మంది నీళ్లుతాగే స్థితిలో ఉండరు అలాంటప్పుడు ఐవి ద్వారా ద్రవాలను ఎక్కించాలి.

కోలుకున్నాక...

కోలుకున్న తర్వాత కూడా కొంతమంది మెదడు మీద, గుండె మీద వడదెబ్బ ప్రభావం ఉంటుంది. అందువల్ల ఆ తర్వాత కొంత కాలం దాకా చికిత్సలు కొనసాగించాలి.

చందనం, వట్టివేరు, గులాబిరేకుల పొడి, ధనియాలు, కొంచెంగా యాలకులు వీటన్నింటినీ మిశ్రమంగా చేసుకుని రోజూ చెంచా నీళ్లల్లో కలపి తాగాలి. అలా దాదాపు రెండు నెలల పాటు తాగితే వడదెబ్బ దుష్ప్రభావాలన్నీ తొలగిపోతాయి. వీటితోపాటు శడంగ పానీయపు పొడిని కూడా రోజూ ఒక చెంచా చొప్పున నీళ్లల్లో కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

గమనిక : పై విషయాలు కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Post a Comment

0 Comments