GET MORE DETAILS

తెలుసు కుందాం - కాంతి - తరంగామా ? కణమా ?

 తెలుసు కుందాం - కాంతి - తరంగామా ? కణమా ?



కాంతి - తరంగమా ?కణమా ? అంటే చెప్పడము కష్టమే ! ఒక్కొక్క సారి ప్రశ్న కు ఎదురు ప్రశ్నే జవాబునిస్తుంది . ఉదాహరణకి నాణేనికున్నది బొమ్మా లేదా బొరుసా? అంటే ఏం చెబుతాం ?. కాంతికి కుడా నాణేనికిలాగే కణ(Corpuscular) స్వభావము , తరంగ (Wave)స్వభావము సంయుక్తంగా అవిభాజ్యంగా ఉంటాయి.ఎలాగైతే నేల మీద పడేసిన నాణెపు రెండు వైపులా (బొమ్మ ,బొరుసు) ఒకే సారి ఎలా చూడ లేమో ... ఒకే ప్రయోగం ద్వారా కాంతికున్న తరంగ స్వభావాన్ని ,కణ స్వభావాన్ని ఏకకాలం లో పరిశీలించాలేము.
కాంతి వక్రీభవనం(Refraction), వివర్తనం (Disfraction) , వ్యతికరణం (Interference), ద్రువనం (Polarisation) అనే ధర్మాలను కలిగి ఉంటుంది . కాంతి కున్న తరంగ స్వభావానికి ఈ దృగ్విషయాలు కారణము.కాంతి విద్యుత్ఫలితము (PhotoElectricEffect), కాంఫ్తాన్ ఫలితము , కాంతి రసాయనిక చర్యలు , కృష్ణ వస్తు వికిరణం,ఉద్గార వర్ణ పటాలు వంటి ప్రయోగ ఫలితాలు , పరిశీలనలు , కాంతి కున్న కనస్వభావాన్ని సూచిస్తాయి. ప్రయోగ పూర్వకంగా రెండు లక్షణాలు ఏక సమయంలో ఉండడం వల్ల కాంతికి కణ-తరంగ ద్వంద్వ స్వభావం (WaveParticleDuality) ఉందంటారు.

Post a Comment

0 Comments